వీసాల జారీలో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. వీసా దరఖాస్తుల పరిశీలనను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రపంచంలోని తన అన్ని దౌత్య కార్యాలయాలనూ ఆదేశించింది. పర్యాటక, బిజినెస్ సహా ఏ వీసాకైనా సరే దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఇకపై కచ్చితంగా గత 15 ఏళ్ల ఉద్యోగ, నివాస వివరాలను పేర్కొనాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత, గత ఐదేళ్లుగా ఉపయోగించిన ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమాల అక్కౌంట్లు దరఖాస్తులో రాయాలని సహాయ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆదేశాలు జారీ చేశారు. ఆరు ముస్లిం దేశస్తులకు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలకు ఇది కొనసాగింపు. తాజా మార్పులతో నేర, ఉగ్ర కార్యకలాపాలకు సహకరించేవారిని నియంత్రించవచ్చు.