American immigration policy
-
అమెరికా వీసాలు పొందడంలో భారత్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్ మిషన్ ఇన్ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది. ‘‘కోవిడ్–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్ డి అఫైర్స్ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్ కౌన్సిలర్ డాన్ హెల్ఫిన్ అన్నారు. ఇరవై శాతం మంది భారతీయులే.. అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి. ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
మీరే కావాలి!
సాక్షి, అమరావతి: ‘పెద్దన్న’ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి విదేశీ నిపుణుల రాకపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే అమెరికా కంపెనీలు మాత్రం వారే ముద్దని తేల్చి చెబుతున్నాయి. ‘రండి రండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..’ అని విదేశీ నిపుణులకు ఆహ్వాన గీతం ఆలపిస్తున్నాయి. విదేశీ నిపుణులతోనే తమ కంపెనీల వృద్ధి ముడిపడి ఉందని కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికాలో తాజాగా నిర్వహించిన ‘ఇమిగ్రేషన్ ట్రెండ్స్–2020’ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎన్వాయ్ గ్లోబల్, హ్యారీష్ పోల్ సర్వే సంస్థలు సంయుక్తంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఈ సర్వే నిర్వహించాయి. అమెరికాలోని 400కిపైగా కంపెనీల హెచ్ఆర్ విభాగాలను సంప్రదించి వృత్తి నిపుణులు, ఉద్యోగుల నియామకంలో ఆ కంపెనీల ప్రాధాన్యతలను తెలుసుకున్నాయి. ఇలాగైతే ఇబ్బందే.. కెనడా వెళ్లిపోతాం ప్రస్తుతం అమెరికాలో వీసా నిబంధనలను కఠినతరం చేయడం తమకు పెద్ద సమస్యగా మారిందని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా విదేశీ నిపుణుల నియామక ప్రక్రియ అనుకున్న విధంగా సాగడం లేదని చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విదేశీ నిపుణులకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ జారీ చేయాలని అమెరికాలోని 71 శాతం కంపెనీలు కోరుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్, పారిశ్రామికంగా అంతగా ప్రసిద్ధి చెందని నగరాలు, ప్రాంతాల్లో నెలకొల్పే కంపెనీల్లో విదేశీ నిపుణులు పనిచేసేందుకు ఈ విధానం కింద సులభంగా వీసాలు జారీ చేయాలని సూచిస్తున్నాయి. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితే కొనసాగితే తాము కెనడాకు తరలి పోవాల్సి వస్తుందని 40 శాతం అమెరికా కంపెనీలు చెబుతుండటం గమనార్హం. ఉద్యోగాలకు అర్హులైన అమెరికన్లు ఏరి? అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గట్టిగా చెబుతున్నా వారు మాత్రం ఉద్యోగాలు చేసేందుకు సుముఖత చూపడం లేదని సర్వేలో వెల్లడైంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2019 నవంబర్ నాటికి అమెరికాలో 6.80 మిలియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 5.80 మిలియన్ల మంది అమెరికన్లే ఉద్యోగాలు చేసేందుకు సానుకూలత ప్రదర్శించారు. అంటే ఒక మిలియన్ ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన అమెరికన్లు లేరు. ఇదే పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అర్హులైన నిపుణులను నియమించుకోవాలంటే విదేశీయులపై ఆధారపడక తప్పదని అమెరికా కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. విదేశీ నిపుణులకు జై - అమెరికాలోని 93 శాతం కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వేలో తేలింది. - తమ కంపెనీల వృద్ధి వ్యూహంలో విదేశీ నిపుణుల నియామకం కీలక అంశంగా భావిస్తున్నాయి. - అత్యంత నైపుణ్యం అవసరమైన కీలక పోస్టుల్లో విదేశీయుల నియామకానికే మొగ్గు చూపాయి. - విదేశీ నిపుణులు తమ కంపెనీల ఎదుగుదలలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నట్లు 50 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి. - విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు స్పాన్సర్ చేసినట్లు 71 శాతం కంపెనీలు తెలిపాయి. -
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
-
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
వాషింగ్టన్: ఒక వ్యక్తి తరఫున ఒకటి కంటే ఎక్కువ హెచ్–1బీ వీసా దరఖాస్తులు వస్తే అన్నింటిని తిరస్కరించే వీలుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి హెచ్–1బీ పిటిషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఆదేశాలిచ్చింది. హెచ్–1బీ వీసాల జారీలకు సంబంధిన లాటరీలో తమ పేరు ఎలాగైనా వచ్చేందుకు ఒక వ్యక్తి తరఫున ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏదైనా వ్యాపార అవసరముంటే తప్ప ఒకే లబ్ధిదారుడి తరఫున సంబంధిత సంస్థలు(రిలేటెడ్ ఎంటిటీస్) దాఖలుచేసే అన్ని హెచ్–1బీ పిటిషన్లను తోసిపుచ్చడం కానీ రద్దు చేయడంగానీ చేస్తాం’ అని స్పష్టం చేసింది. హెచ్ 4 రద్దు చేస్తే తగ్గనున్న అమెరికాపై మోజు! హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్ 4 వీసా ప్రక్రియను ఒకవేళ ట్రంప్ సర్కారు రద్దు చేస్తే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికాపై ఆకర్షణ తగ్గే ప్రమాదముందని వలసదారుల అనుకూల సంస్థ ఒకటి తన నివేదికలో పేర్కొంది. హెచ్–1బీ వీసాపై వచ్చి శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే ఆ పాలసీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. హెచ్ 4 వీసాతో జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల.. అదనపు ఆదాయం సమకూరడంతో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఆకర్షణీయ ప్రాంతంగా కొనసాగుతుందని, ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో ఇతర దేశాలతో అమెరికా పోటీ పడేందుకు దోహదపడుతుందని ఆ నివేదిక తెలిపింది. సిలికాన్ వ్యాలీ కంటే అక్కడే హెచ్–1బీలు ఎక్కువ.. అమెరికాలో సిలికాన్ వ్యాలీ కంటే తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ మెట్రో ప్రాంతాల్లోనే ఎక్కువమంది హెచ్–1బీ వీసాదారులు ఉన్నారని ‘ప్యూ’ సంస్థ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ సంస్థ లెక్కల ప్రకారం.. 2010–2016 మధ్య కాలంలో మొత్తం 8,59,600 వీసాలు జారీ కాగా వాటిలో 2,47,900 మంది న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. టెక్సాస్ మెట్రో ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హెచ్1–బీ వీసాదారులు పనిచేస్తున్నట్లు ‘ప్యూ’ నివేదిక పేర్కొంది. సిలికాన్ వ్యాలీ కేంద్రమైన శాన్‌జోస్‌లో 2010–16 మధ్య కాలంలో 22,200 మంది హెచ్–1బీపై పనిచేశారని పేర్కొంది. డాలస్, వాషింగ్టన్ మెట్రో ప్రాంతాల్లో వరుసగా 74 వేలు, 64,800 మంది.. బోస్టన్‌లో 38,300 మంది హెచ్–1బీ వీసాదారులు నివసిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాల్ని వెల్లడించారు. టెక్సస్ కాలేజీ స్టేషన్ మెట్రో ప్రాంతంలో పనిచేసే ప్రతి వంద మందిలో 32 మంది హెచ్–1బీ వీసాదారులేనని, వారిలో 99% మంది అక్కడున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని తెలిపింది. పాత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలివ్వాలి హెచ్–1బీ వీసా దరఖాస్తు సమయంలో వారి పాత ఫోన్ నంబర్ వివరాలు, ఈ మెయిల్ చిరునామాలు, సోషల్ మీడియా వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశ ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన డాక్యుమెంట్లో పేర్కొన్న వివరాల మేరకు.. ‘అమెరికా రావాలనుకుంటున్నవారు కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి రాకుండా నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లుగా ఉపయోగిస్తున్న సోషల్‌మీడియా ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు అందించాలి. ఇంతకుముందు ఏ దేశమైనా మిమ్మల్ని బహిష్కరించిందా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయా? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. తాజా నిబంధనలపై స్పందన తెలియచేసేందుకు 60 రోజుల గడువునిచ్చారు. -
అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే దుష్ప్రచారం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇది పూర్తి విరుద్ధం. భారతీయులే ఎక్కువ మంది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా కంపెనీలను ఏర్పాటు చేసి భారతీయులతోపాటు అమెరికన్లకు, విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో పేరెన్నికగన్న 'సన్ మైక్రో సిస్టమ్స్' నుంచి ఈ మెయిల్ దిగ్గజం 'హాట్ మెయిల్' వరకు ఎన్నో ప్రసిద్ధ కంపెనీలకు ప్రాణంపోసి అమెరికన్లకు ఉద్యోగాలిచ్చిందీ భారతీయ వ్యాపారవేత్తలే. భారత్‌లోని బెంగళూరు నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా వరకు విస్తరించిన వెంచర్ క్యాపిటల్ సంస్థ 'ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్' డైరెక్టర్ మను రేఖి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో అమెరికాలో ఉద్యోగావకాశాలను పెంచిన భారత వ్యాపార దిగ్గజాల గురించి మరిన్ని వివరాలు పొందుపరిచారు. ఈరోజు అందరికి సుపరిచితులైన గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెండ్ల, పెప్సీ సీఈవో ఇంద్రా నూయీ, అడోబ్స్కు చెందిన శంతను నారాయెణ్లు దశాబ్దాల క్రితమే అనేక భారతీయ సంస్థలకు బీజం వేశారు. తొలితరం భారతీయ వ్యాపారవేత్తలు 1980 దశకంలో అమెరికాకు రావడం ప్రారంభమైంది. కన్వల్ రేఖి, వినోద్ ఖోస్లా, నరేన్ గుప్తా, ప్రభూ గోయల్, సుహాస్ పాటిల్ లాంటి వారెందరో సిలికాన్ వ్యాలీలో ప్రవేశించి సన్ మైక్రోసిస్టమ్స్ (తర్వాత ఓరాకిల్ స్వాధీనం చేసుకొంది), ఎక్సిలాన్, సైరస్ లాజిక్ లాంటి కంపెనీలను ఏర్పాటు చేసి ఎంతో మంది అమెరికన్లను ఉద్యోగావకాశాలను కల్పించాయని మను రేఖి తన నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలో వినియోగదారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియని దశలోనే అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు అమెరికాలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో వినియోగదారుడిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా భారతీయులు కంపెనీలను ఏర్పాటు చేయడం, విదేశీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రారంభించారు. ఈ దశలో సబీర్ భాటియా 1996లో హాట్‌మెయిల్ డాట్ కామ్ ఏర్పాటు చేయడం విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో సందేహం లేదు. ఆయన ఈ సంస్థను స్థాపించక ముందు భారత్‌లోని బిట్స్ బిలానీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేశారు. అనంతరం ఆపిల్ కంపెనీలో పనిచేసి, సొంతంగా హాట్ మెయిల్ కంపెనీని స్థాపించారు. 1990వ దశకంలోనే భారత సంతతికి చెందిన ఎంతోమంది వ్యాపారవేత్తలు సిలికాన్ వ్యాలీలో దిగ్గజాలుగా పైకొచ్చారు. 'నెట్స్కేలర్' అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బీవీ జగదీష్, 2000 సంవత్సరంలో ఆ కంపెనీకి సీఈవో అయ్యారు. ఆయన ఇప్పటికీ కూడా కాజ్ వెంచర్స్‌లో మేనేజింగ్ పార్టనర్‌గా ఉంటూ అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరోపక్క స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు శాంటా క్లారా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా స్టార్టప్ కంపెనీలపై విద్యార్థులకు క్లాసులు తీసుకుంటున్నారు. గూగుల్ తొలి పెట్టుబడిదారుల్లో ఒకరై ఆ కంపెనీలో 130 కోట్ల డాలర్ల షేర్లు కలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ రామ్ శ్రీరామ్ అమెరికాలో అనేక స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నారు. నాస్డాగ్ ఐపీఓ జాబితాలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రముఖ కంపెనీల జాబితాలో 17 కంపెనీలు భారతీయులు స్థాపించిన లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్న కంపెనీలే కావడం ఇక్కడ విశేషం. ఈ కంపెనీల మార్కెట్ షేర్ల విలువ 2,600 కోట్ల డాలర్లకు పైమాటే. నేడు అమెరికాలోని 261 యూనికార్న్స్ (వంద కోట్ల డాలర్లకు మించిన ప్రైవేటు కంపెనీలు)లలో 14 కంపెనీలు భారత సంతతి వారివే. ఈ కంపెనీల షేర్ల విలువ 3,550 కోట్ల డాలర్లు. ఇవి కాకుండా ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో, మానవ వనరులను ఔట్ సోర్సింగ్ ఇచ్చే కంపెనీల్లో కూడా భారతీయ వ్యాపారవేత్తలు ఎంతో మంది ఉన్నారు. -
హెచ్-1బీ వీసాలపై మళ్లీ టెన్షన్
-
హెచ్-1బీ వీసాలపై మళ్లీ టెన్షన్
వీసా జారీ మరింత కఠినం ⇒ దరఖాస్తుల నిశిత తనిఖీలకు ట్రంప్ ఆదేశం ⇒ ఔట్‌సోర్సింగ్‌ను నియంత్రించేలా బిల్లు వాషింగ్టన్: వీసాల జారీలో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. వీసా దరఖాస్తుల పరిశీలనను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రపంచంలోని తన అన్ని దౌత్య కార్యాలయాలనూ ఆదేశించింది. పర్యాటక, బిజినెస్ సహా ఏ వీసాకైనా సరే దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఇకపై కచ్చితంగా గత 15 ఏళ్ల ఉద్యోగ, నివాస వివరాలను పేర్కొనాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత, గత ఐదేళ్లుగా ఉపయోగించిన ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమాల అక్కౌంట్లు దరఖాస్తులో రాయాలని సహాయ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆదేశాలు జారీ చేశారు. ఆరు ముస్లిం దేశస్తులకు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలకు ఇది కొనసాగింపు. తాజా మార్పులతో నేర, ఉగ్ర కార్యకలాపాలకు సహకరించేవారిని నియంత్రించవచ్చు. తక్షణమే వీసాల జారీకి సంబంధించిన కఠినమైన ప్రక్రియను రూపొందించాలని, దరఖాస్తుదారులకు మరిన్ని అదనపు ప్రశ్నలు జోడించాలని టిల్లర్సన్ పంపిన కేబుల్‌లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించేలా ఒక్కో వీసా జారీ అధికారి రోజుకు 120 వీసా ఇంటర్వూ్యలకు మించి చేయకూడదని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఇవన్నీ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలన్నారు. దీనివల్ల వీసాల జారీలో జాప్యం జరుగుతుందని, దరఖాస్తుదారులపై భారం పెరుగుతుందని అమెరి కన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ డైరెక్టర్ గ్రెగ్ చాన్ చెప్పారు. అవుట్సోర్సింగ్కు అడ్డుకట్ట! హెచ్1బీ వీసాలను దుర్వినియోగపరుస్తూ విదేశీయులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు అడ్డుకట్ట వేసేలా మరో బిల్లు తెరపైకి వచ్చింది. భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే ఈ బిల్లును ‘కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్’కింద డెమోక్రటిక్ సభ్యుడు డెరెక్ కిల్మెర్, రిపబ్లికన్ సభ్యుడు డౌగ్ కొలిన్స్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్1బీ ప్రోగ్రామ్ ద్వారా తాత్కాలిక వీసాలు పొందుతూ అమెరికాకు వస్తున్న విదేశీ ఉద్యోగులను నియంత్రించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలు దేశం దాటి పోకుండా ఉంటాయని కొలిన్స్ తెలిపారు. అమెరికాలోని ఉన్నత నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలను భారత్ తదితర దేశాల నుంచి వచ్చే నిపుణులతో భర్తీ చేసుకొనేలా హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుందంటూ ఓ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో ప్రసారం అయిన మరుసటి రోజే ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడం గమనార్హం. దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం తమకు ఎంతో కీలకమని కొలిన్స్ చెప్పారు. ‘అర్హతగల అమెరికన్లు అందుబాటులో లేనప్పుడు హెచ్1బీ వీసా కింద విదేశీ ఉద్యోగులను తెచ్చుకొనే వీలుంది. అలాగని అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తామంటే.. అలాంటి చట్టాలను మేం సమర్థించం’అన్నారు. -
పరిచయస్తులే కాలనాగులు!
⇒ 12 జిల్లాల్లో అత్యాచార ఘటనలపై పోలీసుల విశ్లేషణ ⇒ 418 కేసుల్లో 416 మంది నిందితులు ఇరుగుపొరుగువారే ⇒ బాధితుల్లో అధికశాతం 15 నుంచి 18 ఏళ్లలోపు వారే ⇒ నిందితుల్లో ఎక్కువ మంది 18 నుంచి 25 ఏళ్ల వారు ⇒ ఇండియన్ పోలీస్ జర్నల్, అమెరికన్ జర్నల్‌కు స్టడీ రిపోర్ట్! సాక్షి, హైదరాబాద్: కన్నుమిన్నూ కానక అత్యా చారానికి పాల్పడే దుర్మార్గుల్లో 99 శాతం ఇరుగు పొరుగువారు, పరిచయస్తులేనని పోలీసు శాఖ స్పష్టంచేసింది. ఈమేరకు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార కేసులపై ఇటీవల ఓ విశ్లేషణ చేసింది. బాధితులిచ్చిన ఫిర్యాదు కాపీల నుంచి పోలీసులు వేసిన చార్జిషీట్లదాకా అధ్యయనం చేసి.. జరిగిన ఘటనలు, నిందితుల విషయాలతో ఒక నివేదికను రూపొందించింది. 2016లో హైదరాబాద్ జోన్ పరిధిలోని 12 జిల్లాల్లో నమోదైన అత్యాచార కేసులపై ఈ అధ్యయనం జరిగింది. బాధితుల సామాజిక వర్గాలు, నిందితుల వివరాలన్నింటినీ సేకరించి ఏటా ప్రచురించే ఇండియన్ పోలీస్ జర్నల్, అమెరికన్ జర్నల్‌కు ఈ నివేదికను పంపించినట్టు తెలిసింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారే అధికం! అత్యాచార ఘటనల్లో అధిక శాతం బాధితులు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారే ఉన్నారు. పోలీసులు విశ్లేషించిన 418 కేసుల్లో 203 మంది ఈ వయసు వారే. బాధితుల్లో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు 80 మంది, 10 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలు 77 మంది ఉన్నారని అధ్య యనంలో తేలింది. అంతేకాదు బాధితుల్లో అధిక శాతం (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) పేదవారేనని వెల్లడైంది. పరిశీలించిన 418 కేసుల్లో 354 మంది బాధితులు పేదవారుకాగా.. 64 మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. అధికశాతం నిందితులు యువకులే అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో 18–25 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. తర్వాతి స్థానంలో 25–30 ఏళ్లలోపు వారున్నారని గుర్తించారు. 50 ఏళ్లకు పైన వయసున్న 10 మంది సైతం అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. ఇక నిందితుల ఆర్థిక పరిస్థితులపైనా పోలీసులు అధ్యయనం చేశారు. నిందితుల్లో 323 మంది పేదవారేనని, 91 మంది మధ్యతరగతి కుటుంబీ కులని గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 2 కేసుల్లో ఇద్దరు నిందితులు ఆర్థికంగా ఉన్నవారిగా తేలిందని నివేదికలో పేర్కొన్నారు. సామాజికపరంగా బాధితులు–నిందితులు అత్యాచార బాధితుల సామాజిక స్థితిగతులపైనా పోలీస్ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఓసీ సామాజిక వర్గాల్లోని మహిళలపైనా లైంగిక దాడులు జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. 418 కేసుల్లో.. 204 మంది ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాధితులుండగా, బీసీలు 189, ఓసీ వర్గాలకు చెందిన వారు 25 మంది ఉన్నారు. అదే విధంగా నిందితుల సామాజిక వర్గాలపైనా పోలీసులు అధ్యయనం చేశారు. నిందితుల్లో అధిక శాతం బీసీ సామాజిక వర్గాల వారే ఉన్నట్టు గుర్తించారు. 418 కేసుల్లో 212 మంది నిందితులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని, 181 మంది ఎస్సీ/ఎస్టీ, 23 మంది ఓసీ వర్గాలకు చెందినవారని నివేదికలో పేర్కొన్నారు. చదువుపరంగా కూడా.. బాధితులు, నిందితుల విద్యాస్థాయిని కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుల్లో పదో తరగతి లోపు చదువుకున్న వారు 259 మంది ఉన్నారని, 133 మంది ఇంటర్, 25 మంది డిగ్రీ, ఒకరు పీజీ చదివినవారు ఉన్నారని గుర్తించారు. అదే నిందితుల్లో పదో తరగతిలోపు చదువుకున్న వారే 239 ఉన్నారని, 129 మంది ఇంటర్, 42 మంది డిగ్రీ, ఆరుగురు పీజీ చేసిన వారున్నారని నిర్ధారించారు. ఈ 418 కేసుల్లో 244 కేసులు దర్యాప్తులో ఉన్నాయని.. 166 విచారణ కొనసాగుతున్న కేసులని, 4 తప్పుడు కేసులు, మరో 4 కేసులు చార్జిషీట్ దశలో ఉన్నాయని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. -
ధూమపానం అప్పుడు మానేసినా మంచిదే!
వాషింగ్ట: ధూమపానాన్ని 60 ఏళ్లలో మానేసినా ఆయుర్దాయం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) శాస్తవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. పొగతాగుతున్న 70 ఏళ్లు లేక ఆపై వయస్కులకు మరణ ముప్పు అసలు తాగని వారి కన్నా మూడు రెట్లు ఉంటుందని కూడా తేల్చారు. ఈ అధ్యయనానికి 70 ఏళ్ల పైబడిన సుమారు లక్షన్నర మంది ప్రజల డేటాను విశ్లేషించారు. ధూమపానం అలవాట్ల గురించి తెలుసుకునే ప్రశ్నావళితో సమాచారం సేకరించారు. పొగ సంబంధ కారణాలతో సంభవించిన మరణాలను పరిగణలోకి తీసుకున్నారు. చనిపోయినపుడు– పొగ తాగడం ప్రారంభించినపుడు వయసులు, మానివేసినపుడు వయసు–70 ఏళ్ల తరువాత పీల్చిన పొగ పరిమాణం మధ్య సంబంధమున్నట్లు 2014–16 మధ్య జరిపిన విశ్లేషణల్లో వెల్లడైంది. -
పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు!
-
పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు!
అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు శక్తిమంతమైన సభ్యులు పాకిస్థాన్‌కు షాకిచ్చేలా ఓ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం(స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం) గా పాకిస్థాన్ని ప్రకటించాలని వారు బిల్లులో కోరారు. ’పాకిస్థాన్ పాల్పడిన వెన్నుపోట్లకుగాను.. మనం ఆ దేశానికిచ్చే నిధులను ఆపివేసి.. దానిని ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (చట్టసభ) సభ్యుడు, ఉగ్రవాదంపై సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయి ఈ బిల్లులో పేర్కొన్నారు. ఆయన డెమొక్రిటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు డెనా రోహ్రాబచర్‌తో కలిసి ’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను గుర్తించే చట్టం’ బిల్లును ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీలో కీలక సభ్యుడిగా డెనా రోహ్రాబచర్ ఉన్నారు. ’పాకిస్థాన్ ఒక విశ్వసించలేని మిత్రదేశమే కాదు.. అది ఎన్నో ఏళ్లుగా మన శత్రువుల్ని రెచ్చగొడుతూ వస్తున్నది. ఒసాన్ బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం మొదలు.. హక్కానీ నెట్‌వర్క్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వరకు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్‌కు ఎవరికి అండగా నిలిచిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అది అమెరికాకు ఎప్పుడు అండగా నిలబడలేదు’ అని పోయి వివరించారు. ఒబామా సర్కారు తమ బిల్లుపై అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందా? లేదా? అన్న దానిపై 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పేరుకే యూఎస్.. మెజారిటీ భారతీయతే!
అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో మనమే ఎక్కువ * అక్కడి మేధావుల్లో ఆసియన్లు ఎక్కువ.. అందులోనూ భారత్ టాప్ * ఉన్నత విద్యలో నాణ్యత, ఎక్కువ సంపాదనతోనే వలసలు వాషింగ్టన్: అమెరికన్ ఇమిగ్రేషన్ పొందుతున్న సైంటిస్టులు, ఇంజనీర్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని యూఎస్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) వెల్లడించింది. ఆసియా దేశాలనుంచి ఈ విభాగంలో వలస వస్తున్నవారు ఎక్కువగా ఉండగా.. అందులోనూ భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. జీవ శాస్త్రవేత్తలు, కంప్యూటర్, గణిత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లే ఎక్కువగా అమెరికాకు వలసవస్తున్నట్లు వెల్లడైంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చిన వారు ఆయా దేశాలకంటే ఎక్కువ సంపాదన అక్కడే ఉండటంతో అమెరికాలోనే సెటిల య్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు అక్కడి వర్సిటీల్లో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత చదువులకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో చదువు పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తుండటం మరో కారణం. ఆసియా నుంచి 29 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా.. అందులో 9.5లక్షల మంది భారతీయులే. 2003 నుంచి యూఎస్ వెళ్తున్న భారతీయుల సంఖ్యలో 2013 వరకు 85శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. 2013 వరకు యూఎస్‌లోని విదేశీ శాస్త్రవేత్తల్లో 57శాతం ఆసియావారేనని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లెక్కా ఇదే! ప్రపంచంలో వలసల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్ఏ) అంతర్జాతీయ వలసదారులపై ఈ సర్వే చేసింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి నివసిస్తున్న వలసదారుల జనాభా, ఇతర దేశాల వలసల కన్నా ఎక్కువగా ఉంది. 2015లో భారత్‌కు చెందిన 1.6 కోట్ల మంది ఇతర దేశాల్లో నివసిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. దీని ప్రకారం.. 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది వలస వెళ్లారు. ఇది 2000 సంవత్సరంలో లెక్కల కన్నా 41 శాతం ఎక్కువ. -
అమెరికాలో పండనున్న ‘పటేళ్ల’ పంట
అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజికవర్గాలలో గుజరాత్‌కు చెందిన పటేల్ కమ్యూనిటీ ఒకటి. ఆ దేశంలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు)లో సగం వరకు వీళ్లే నిర్వహిస్తున్నారు. 20వ శతాబ్దికి ముందు ఎలాంటి వ్యాపార చరిత్ర లేని పటేళ్లు పరదేశంలో హోటల్ రంగంలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే ఒక విశేషం. ఇప్పుడు అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ పటేళ్ల పంట పండించనుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను పాఠశా లలో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం దర ఖాస్తు చేస్తూ తన చివరి పేరును మార్చు కున్నాడు. అతడు పటేల్. అదే పేరుతో దరఖాస్తు చేసినట్లయితే తన వీసాను తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉం దని అతడు భావించాడు. అది నిజమో కాదో నాకయితే తెలీదు (నేను కూడా 16 సంవత్సరాల వయసులోనే దరఖాస్తు చేసి వీసా పొందాను). కానీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పటేళ్లు అప్పటికే చాలామంది ఉండేవారన్న మాట నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా అమెరికా వలస విధానంలో ప్రకటించిన మార్పు అమెరికాలోని అక్రమ వలస దారులకు ప్రత్యేకించి 5 లక్షల మంది భారతీయుల ప్రతిపత్తిని చట్ట బద్ధం చేయనుంది. వీరిలో చాలామంది గుజరాత్‌కి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందినవారే. వలసవిధానంలో మార్పుచేస్తూ ఒబామా ఇచ్చిన ఆదేశం 41 లక్షలమంది అమెరికా సంతతి పిల్లల తల్లిదండ్రులకు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 3 లక్షల మంది పిల్లలకు వరంగా మారిందని మీడియా సమాచారం. అమెరికాలో నివసిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న నిపుణత కలిగిన వలస ఉద్యోగులు, పట్టభద్రులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సదవకా శాన్ని కల్పిస్తూ ఒబామా వలస విధానంలో విస్తృత మార్పులను ప్రకటించారు. అమెరికాను ఇతర ప్రపంచ దేశాల కంటే ముందు నిలపడంలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1.5 లక్షల మంది పటేళ్లు ఉన్నారని అంచనా. అయితే చాలామంది పటేళ్లు తమ చివరి పేర్లకు అమిన్ వంటి పేర్లను ఉపయోగిస్తున్నం దున వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చు. అమెరికాలో ఉన్న పటేల్ వర్గీయులలో చాలామంది చట్టబద్ధంగా వచ్చినవారే. అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజిక వర్గాలలో వీరిదీ ఒకటి. అమెరికాలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు) లో సగం వరకు భారతీయులు.. అందులోనూ పటేల్ సామాజికవర్గమే నిర్వహిస్తోం దని 1999లో తుంకు వరదరాజన్ అనే విలేకరి న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు. పటేళ్లు ఎవరంటే, ‘వైశ్యులు లేదా వర్తకులు. అరేబియన్ సముద్రం పక్కన ఉండే భారతీయ రాష్ట్రం గుజరాత్లో మధ్యయుగాల్లో రాజులకు చెల్లించవలసిన పదో వంతు పన్నును లెక్కించడానికి వీరిని నియమించేవారు. వీరి మూలం గుజరాత్. వీరి రక్తంలోనే వ్యాపారం నిండి ఉంటుందని భారతీయులలో చాలా మంది ప్రజల నమ్మకం. పటేళ్లు కూడా దీన్ని నమ్ముతున్నట్లే కనిపిస్తారు’ అని ఆ విలేకరి రాశారు. ఇది నిజం కాదు. స్వయంగా పటేల్ వర్గీయులే నమ్మేసేటంత స్థాయిలో వారు తమ గురించి తాము తారస్థాయిలో ప్రచారం చేసుకున్నట్లు చెప్పుకునే కల్పనాగాథల నుండి ఇవి పుట్టుకొచ్చాయి. వాస్తవానికి పటేళ్లు కూడా పాటిల్, రెడ్లు, యాదవులు, గౌడలు, జాట్లు వంటి ఇతర రైతాంగ కులాల్లో భాగమైన రైతులు. నాలుగు కిందిస్థాయి సవర్ణులు లేదా గుర్తింపు పొందిన కులాల నుండి వీరు వచ్చారు. మనుస్మృతిలో వీరిని శూద్రులుగా పేర్కొన్నారు. అయితే పటేళ్లు ఈ నాలుగు సామాజిక బృందాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీరు శాకాహారులు, పైగా వీరు వ్యాపారంవైపు మొగ్గు చూపారు. అయితే వీరికి వ్యాపారం ఒక వారసత్వంగా రాలేదు. 20వ శతాబ్దికి ముందు వీరికి ఎలాంటి వ్యాపార చరిత్రా లేదు. కానీ జైన్ వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న గుజరాత్లో వ్యాపార సంప్రదాయాన్ని వీరు పుణికిపుచ్చుకున్నారు. అయితే పటేళ్లు హార్డ్‌వేర్ స్టోర్లు, పెట్ షాపులు, ఔషధ విక్రయ సంస్థలలో ప్రవేశించకుండా మోటల్స్‌లో తమ అదృష్టాన్ని ఎందుకు చూసుకున్నారు అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ రచయిత వరద రాజన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక కారణం ఏదంటే మోటల్స్ వ్యాపార స్థాయి విభిన్నమైనది. పైగా మోటల్స్ను విస్తరించుకోవచ్చు. రెండో కారణం ఏమిటంటే మోటల్స్ వ్యాపారం పటేళ్లకు ద్వంద్వ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మోటల్స్ కౌంటర్ నుంచి వీరు అమెరికాతో వ్యవహరిస్తారు. కౌం టర్ వెనుక కిచెన్‌లో కధీ-బాత్ (గుజరాత్ ఆహారం) వంట వండ టం, టెలివిజన్లలో రామాయణం, బాలీవుడ్ సినిమాలను చూడటం ద్వారా వీరు అమెరికాలోనే భారత్‌ను పునఃసృష్టి చేయగలరు. మోటల్ వ్యాపారం మేధస్సు కంటే కష్టపడటం అవసరమైన వ్యాపారం. పటేళ్లు దాన్నే కోరుకున్నారు. అందుకనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న పటేల్ సైతం ఆ దేశానికి సంపద లాంటి వాడు. ఎందుకంటే అతడు తనకు, తన కమ్యూనిటీకి కట్టుబడి ఉంటాడు తప్పితే దేశానికి అతడు ఉపద్రవం, కంటకం కాదు. పైగా, పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ వలస ప్రజలకు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల కంటే మించిన మంచి పేరుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే సాధారణంగా వలస భారతీయులు ఉన్నత సామాజికవర్గానికి సంబంధించిన వారై ఉండటం. పైగా అన్ని అర్హతలూ కలిగిన వృత్తి జీవుల్లా కనిపిస్తారు. మరొక కారణం ఏమిటంటే ప్రత్యేకించి యూరప్‌లోని పాకిస్థానీ, బంగ్లాదేశీ వలస దారులలో చాలామంది తీవ్ర మతాభినివేశం కలిగి ఉన్నారు. వీరు అరబ్ బృందాలతో జత కట్టారు. దీంతో వీరు హానికరంగా తయారయ్యారు. వీరిలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. దీంతో పాకిస్థానీ, బంగ్లాదేశీ వలసదారులను ఆతిథ్య దేశం లేదా ఖండం ఒక ఉపద్రవంగా చూస్తోంది. నా పాకిస్థానీ మిత్రుడొకరు ఇటీవల ఒక విషయం చెప్పారు. ప్రత్యేకించి అమెరికాలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులు ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో ముడిపడి ఉంటే వచ్చే సమస్యలనుండి తప్పించుకోవడం కోసం ఫక్తు భారతీయుల్లా వ్యవహరిస్తున్నారట. మరోవైపున యూరప్‌లోని ఉపఖండ రెస్టారెంట్లలో చాలా వాటిని బంగ్లాదేశీయులు సమర్థవంతంగా నడుపుతున్నారు కానీ ఇవి ఇండియన్ రెస్టారెంట్లుగా గుర్తింపు పొందాయి. బంగ్లాదేశ్ అంటే ఎక్కడుంది, వాళ్లెవరు అనే పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు.. యూరప్‌లో ఇండియన్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మూడో కారణం ఏమిటంటే భారతీయ ఆహారంగా పశ్చిమ దేశాలకు పరిచితమైనది బెంగాలీ ఆహారమే. ఈ నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ మూడు ఉపఖండ బృందాలకూ దోహదపడు తుంది కానీ, భారతీయులు ప్రత్యేకించి పటేళ్లకే ఇది ఎక్కువగా ఉపకరిస్తుంది. పటేల్ కమ్యూనిటీకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇది మంగళకరమైన వార్తే. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ -
26/11 దాడి మృతులకు యూదుల శ్రద్ధాంజలి
న్యూయార్క్/ముంబై: నవంబర్ 26 ఉగ్రవాద దాడిలో అసువులుబాసిన వారికి ఇండో-అమెరికన్, అమెరికన్ యూదు సమాజం ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. 26/11 ఉగ్రవాద నరహంతక దాడి జరిగి ఐదేళ్లు గడిచిన సందర్భంగా మంగళవారం నాడు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఆసియా ఫసిఫిక్ రీజియన్ యూదు కమిటీ మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించింది. పాక్ ప్రేరేపిత లష్కరే మూకలు చేసిన దాడిలో మరణించిన వారికి న్యాయం జరగాలని కోరింది. యూదు ప్రార్థనా మందిరం మీద చేసిన హంతక దాడిలో ఉగ్రవాదులు పలు దేశాలకు చెందిన యూదులు మరణించారు. గావ్రీయేల్ నోచ్ హోల్టే జ్బెర్గ్, ఆయన సతీమణి రివాకలు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ కాన్సూల్ జనరల్, రాయబారి ద్యానేశ్వర్ ములూ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదం అనేదానికి మతం, కులం, ప్రాంతం, దేశం అనేదిలేదు. 21వ శతాబ్దిలో పెచ్చరిల్లిన ఉగ్రవాదాన్ని మరింత సమైక్యంగా ఎదుర్కొని ఓడించాల్సిన సమయం ఆసన్నమయింది. భారతదేశం అనేక సంవత్సరాలుగా ఉగ్రవాద బెడద ఎదుర్కొంటోంది. అయితే సెప్టెంర్ 11 దాడులకు ముందు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. పెరుగుతున్న ఈ ప్రమాదాన్ని అంతర్జాతీయ వేదికల మీద హెచ్చరించలేదు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాదు, దాన్ని జాతీయ విధానంగా ఆచరిస్తున్నాయి. జరిగిన సంఘటనల నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిందే. ఉగ్రవాదం అనే ఈ పదాన్ని తుడిచి పెట్టడానికి సంఘటితంగా పోరాడాల్సి ఉంది. మానవాళి విశాల ప్రయోజనాల కోసం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధిం చాలి’’ అని ప్రకటించారు. ఇజ్రాయెల్ కాన్సూల్ జనరల్, రాయబారి ఇదో అహరోణి మాట్లాడుతూ‘‘పక్కా సమన్వయంతో ముంబైలో పలు అంచెలుగా జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌ను ఇజ్రాయెల్‌కు సన్నిహితం చేసింది. ప్రపంచంలోని ఏ దేశంతో జరిగే ఒప్పందం సందర్భంగానైనా ఉగ్రవాద నిరోధక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు చెందిన చిన్న బృందంలో భారత్, ఇజ్రాయెల్‌లు ఇప్పుడు సభ్యులు’’ అన్నారు. అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సేవ్హాని మాట్లాడుతూ ‘‘నవంబర్ 26 ఉగ్రవాద దాడిపై జరిగిన న్యాయవిచారణ, వచ్చిన తీర్పుతో పాకిస్తాన్ మెల్కోనాలి. అయితే పాక్ ప్రభుత్వం ఈ దాడుల కుట్రకు సూత్రదారి హాఫీజ్ సయీద్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఉగ్రవాద దాడులు బెడదను పలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇండియా, ఇజ్రాయిల్, అమెరికాలు దీన్ని ఓడించడానికి ఉమ్మడిగా పోరాడాలి’’ అన్నారు.