
ఆ వ్యక్తికి 300 ఏళ్ల జైలు శిక్ష!
బాలలపై లైంగిక దాడులకు పాల్పడిన నేరంలో ఓ వ్యక్తికి 300 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. లాస్ ఏంజెలిస్‌కు చెందిన గిల్బర్ ఆండ్రూ ఛవారియా(29) ఆటో మెకానిక్‌గా పనిచేసేవాడు.
లాస్ ఏంజెలిస్(యూఎస్‌ఏ): బాలలపై లైంగిక దాడులకు పాల్పడిన నేరంలో ఓ వ్యక్తికి 300 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. లాస్ ఏంజెలిస్‌కు చెందిన గిల్బర్ ఆండ్రూ ఛవారియా(29) ఆటో మెకానిక్‌గా పనిచేసేవాడు. అతడు 2013లో ఎస్కాండిడో, సాన్ మార్కోస్ ప్రాంతాల్లోని పలు నివాసాల్లోకి చొరబడి ఐదేళ్లలోపు నలుగురు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు దోపిడీ, దాడి, అసభ్యప్రవర్తన, బాలల అశ్లీల సాహిత్యం కలగి ఉండటంవంటి 22నేరాల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ నిందితుడు పోలీసులు చేసిన ఆరోపణలను కొట్టి పారేశాడు. అయితే అవి రుజువైతే మాత్రం దాదాపు 300 ఏళ్ల జైలుశిక్ష తప్పదని పోలీసులు చెబుతున్నారు. ఇతడు మరికొన్ని నేరాలకు కూడా పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్న పోలీసులు.. బాధితులు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.