ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 2కి.మీల పిజ్జా! | 1.9 km-long pizza sets Guinness World Record in US | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 2కి.మీల పిజ్జా!

Published Sun, Jun 25 2017 3:29 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 2కి.మీల పిజ్జా! - Sakshi

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 2కి.మీల పిజ్జా!

అమెరికాలో ఓ పిజ్జా ప్రపంచ రికార్డులు తిరగరాసింది. దాదాపు 100 చెఫ్‌లు కలిసి దీనిని రూపొందించి గిన్సీస్‌ బుక్‌ రికార్డుల్లో చేరిపోయేలా చేశారు.

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ పిజ్జా ప్రపంచ రికార్డులు తిరగరాసింది. దాదాపు 100 చెఫ్‌లు కలిసి దీనిని రూపొందించి గిన్సీస్‌ బుక్‌ రికార్డుల్లో చేరిపోయేలా చేశారు. ఈ పిజ్జా పొడవు ఎంతో తెలిస్తే కచ్చితంగా అవాక్కవాల్సిందే. ఎందుకంటే అదేదో ఒకటి రెండు మీటర్లు కాదు..ఏకంగా 1,930 మీటర్లు.

గతంలో 1,853.88 మీటర్ల పేరిట ఇటలీ తయారుచేసిన ఓ పిజ్జా పేరిట ప్రపంచ రికార్డు ఉండగా దానిని చెరిపేసి తాజాగా ఈ అమెరికా పిజ్జా రికార్డును సృష్టించింది. పిజ్జావోవెన్స్‌ డాట్‌ కామ్‌ అనే అమెరికాకు చెందిన  రెస్టారెంటు ఈ పిజ్జాను తయారుచేయించింది. ఇందులోకి దాదాపు 3,632 కిలోల పాలపిండి పదార్థాన్ని, 1,634కిలోల చీజ్‌ను, 2,542కేజీల సాస్‌ను ఉపయోగించారు. ఓ కన్వేయర్‌ బెల్టు మీద దీనిని అమర్చడం ద్వారా ఎనిమిదిగంటలపాటు కష్టపడి ఉడికించి దీనిని తయారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement