సైబర్ అటాక్పై మైక్రోసాప్ట్ మండిపాటు
సైబర్ అటాక్పై మైక్రోసాప్ట్ మండిపాటు
Published Mon, May 15 2017 11:47 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
వాషింగ్టన్ : వనా క్రై అనే సైబర్ అటాక్ తో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ హడలిపోయిన సంగతి తెలిసిందే. కారు సంస్థలు, ఆసుపత్రులు, స్కూల్స్, షాపుల్లో ఇది బీభత్సం సృష్టించింది. మరోసారి ఈ రోజు కూడా ఇది పంజా విసరనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అటాక్ కు అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడుతోంది. ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించేందని, దీన్ని ఏప్రిల్ లో ఆన్ లైన్ లీక్ చేసినట్టు మైక్రోసాప్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ తన బ్లాక్ పోస్టులో పేర్కొన్నారు. రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టీకరించినట్టు తెలిపారు. ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ల దుర్భలత్వాన్ని బ్రాడ్ స్మిత్ ఎత్తిచూపారు.
అంతకముందు కూడా అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్దీ హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసి, వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని వికిలీక్స్ రివీల్ చేసిందని, ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు బలవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ దాడితోనైనా అమెరికా ప్రభుత్వం మేల్కోవాలని, ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అయితే మైక్రోసాఫ్ట్ చేసిన కామెంట్లపై ఎన్ఎస్ఏ కాని, వైట్ హౌజ్ కాని ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి గురైన చాలా సిస్టమ్స్ బ్యాకప్స్ తో రికవరీ చెందుతున్నారని స్కాట్ బోర్గ్ చెప్పారు. ఈ దాడిపై శుక్రవారం రాత్రి తమ హోమ్ లాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు.
Advertisement
Advertisement