
అమెరికాలో రాబోయే దశబ్ద కాలంలో 12 రకాల ఉద్యోగాలు చాలా వేగంగా కనుమరగవతున్నట్లు ఆ దేశ లేబర్ స్టాటస్టిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. దీనికి కారణం పెరుగుతున్న సాంకేతికత బయటి దేశాలకు అవుట్ సోర్సింగ్ ఇవ్వడమేనన్నారు. ముఖ్యంగా బుక్ కీపింగ్, అకౌంటింగ్, ఆడిటింగ్ క్లర్క్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వంటి ఉద్యోగాలు 2014-2019 మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోనున్నట్లు అంచనా వేస్తూ ఓ రిపోర్టును విడుదల చేశారు.
ఆ వివరాలు..
♦ బయటి దేశాల అవుట్ సోర్సింగ్ కారణంగా అమెరికాలో కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏడాదికి 80 వేల డాలర్లు పొందే ప్రోగ్రామర్స్ 2014 వరకు దేశంలో 3 లక్షల 29 వేల మంది ఉన్నారు. 2024 వరకు ఈ సంఖ్య 8 శాతం తగ్గి 3లక్షల 2 వేలకు చేరనుంది.
♦ మోల్డింగ్, కోర్‌మేకింగ్, మెషిన్ సెట్టర్స్, ఆపరేటర్స్, టెండర్స్, మెటల్, ప్లాస్టిక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఈ రంగ కంపెనీలన్ని కంప్యూటర్ రోబట్‌లపై ఆధారపడుతుండటంతో 32 వేలమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోనున్నారు. ఈ రంగంలోని ఉద్యోగులు ఏడాదికి 29 వేల డాలర్లు వేతనంగా పొందుతుండగా.. 2014 లెక్కల ప్రకారం లక్షా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 2024 వరకు ఈ సంఖ్య 97 వేలకు పడిపోనుంది.
♦ స్విచ్ బోర్డు ఆపరేటర్స్, టెలీకాలర్స్ రంగంలో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం లక్షా 12 వేల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుండగా 2024 కల్లా ఈ సంఖ్య 76 వేలకు తగ్గనుంది.
♦ పోస్టల్ సర్వీస్ మెయిల్ సోర్టర్స్, ప్రాసెసర్స్, ప్రాసెసింగ్ మెషిన్ ఆపరేటర్స్ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్ మెయిల్ సోర్టింగ్ సాంకేతికతతో ప్రమాదంలో పడునున్నాయి. ఈ రంగంలోనికి ఉద్యోగులు ఏడాదికి 57 వేల డాలర్ల వేతనం పొందుతున్నారు. లక్షా 18 వేలమంది ఉపాధి పొందుతుండగా 2024 వరకు 78 వేలకు చేరనుంది. సుమారు ఈ రంగంలో 40 వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి.
♦ టెల్లర్స్: బ్యాంకింగ్ రంగంలో లావాదేవీలకు బాధ్యత వహించే ఈ ఉద్యోగులు.. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఆప్‌ల రావడంతో అవకాశాలు కోల్పోతున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 5 లక్షల 21 వేలుగా ఉండగా 2024 కల్లా ఈ సంఖ్య 481 వేలకు పడిపోనుంది.
♦ గార్మెంట్స్, డెకరేట్, గార్మెంట్స్, నాన్ గార్మెంట్స్ ఉత్పత్తులను తయారు చేసే కుట్టు యంత్ర ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్, ఆటోమేషన్‌లతో ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందే సంఖ్య లక్షా 54 వేలుగా ఉండగా 27వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఇవే కాకుండా అసంఘటిత, అకౌంటింగ్, ఆహార సంబంధిత రంగాల్లో వేల ఉద్యోగాలు కోల్పోనున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment