వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరోపావుశాతం పెంచింది. మూడు నెలల్లో రెండవ సారి బుధవారం వడ్డీరేట్లు పెంచింది. తాజా పెంపుతో ఫెడరల్ ఫండ్స్ రేటు 1 శాతంనుంచి 1.25 శాతానికి చేరింది. ఫెడరల్ రిజర్వ్ మూడునెలల్లో రెండవసారి బుధవారం వడ్డీ రేట్లను పెంచింది. ఈ ఏడాది బాండ్లను, ఇతర సెక్యూరిటీలను తన హోల్డింగ్స్‌ను తగ్గించనున్నట్లు ఫెడ్ ప్రకటించింది. దీంతో యుఎస్ ఆర్ధికవ్యవస్థ గ్రోత్‌పై విశ్వాసాన్ని, జాబ్ మార్కెట్ మరింత మెరుగుపడనుందన్న సంకేతాలను అందించింది.
రెండు రోజుల సమావేశం తరువాత, ఫెడ్ విధాన ఏర్పాటు కమిటీ ఆర్థిక వ్యవస్థ మధ్యస్తంగా విస్తరిస్తున్నట్లు విధాన ప్రకటనలో చెప్పింది. లేబర్ మార్కెట్ బలోపేతం అయ్యిందనీ, ఇటీవలి ద్రవ్యోల్బణం నిదానంగా కనిపించిందని ఫెడ్ చైర్ జానెట్ యెల్వెన్ ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఫెడ్ తన బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 1.25 శాతానికి పెంచింది. 2007-2009 ఆర్థిక సంక్షోభం మరియు మాంద్యం నేపథ్యంలో చాలా వరకు ట్రెజరీ బాండ్ల మరియు తనఖా-ఆధారిత సెక్యూరిటీల యొక్క $ 4.2 ట్రిలియన్ల పోర్ట్ఫోలియోను తగ్గించాలన్న తన ప్రణాళికపై ఫెడ్ ఒక స్పష్టమైన స్పష్టమైన సూచనలిచ్చింది.
కాగా మార్చి నెలలో 25 బీపీఎస్ పాయింట్ల పెంచి 1 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
Published Thu, Jun 15 2017 8:40 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
Advertisement