యూఎస్ నుంచి పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైనందున ఇక మిలిటరీ రియంబర్స్‌మెంట్‌కింద 2016 సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాట్టిస్ తెలిపారు.
పాక్‌లోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని అమెరికా అధికారులు చెప్పారు. 'పాకిస్థాన్ ప్రభుత్వానికి మేం 2016కుగానూ నిధులు మంజూరు చేయలేం. ఎందుకంటే హక్కానీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పాక్ వ్యవహరించినట్లుగానీ, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకున్నట్లుగానీ పాక్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న మా దేశ ప్రతినిధి జిమ్ మాట్టిస్ ధ్రువీకరించనందున ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పెంటగాన్ అధికారిక ప్రతినిధి ఆడం స్టంప్ విలేకరులకు చెప్పారు.