job growth
-
అంచనాలను మించి పెరిగిన అమెరికా నియామకాలు
అమెరికాలో ఉద్యోగ వృద్ధి మే నెలలో అంచనాలను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత నెలలో 2,72,000 ఉద్యోగాలను జోడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1,65,000 నియామకాల కంటే మే నెలలో భారీగా పెరిగినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది.బ్రీఫింగ్ డాట్‌కామ్ (briefing.com) ప్రకారం.. విశ్లేషకులు అంచనా వేసిన 1,85,000 పెరుగుదల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. 2023 డిసెంబర్ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా ఉద్యోగ వృద్ధితోపాటు నిరుద్యోగం కూడా స్పల్పంగా పెరిగింది. నిరుద్యోగ రేటు 3.9 శాతం నుంచి 4.0 శాతానికి పెరిగిందని ఆ శాఖ పేర్కొంది.అయితే వడ్డీ రేట్లను తగ్గించడానికి సరైన సమయం కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ గణనను క్లిష్టతరం చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రించేందుకు డిమాండ్ తగ్గుతుందనే ఆశతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నెలల్లో రేట్లను 23 ఏళ్ల గరిష్ట స్థాయికి చేర్చింది.ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను జోడించడంతో, ఫెడ్ రేటు కోతలను మరికొంత కాలం నిలుపుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో హెల్త్ కేర్, గవర్నమెంట్ వంటి రంగాలతో పాటు విశ్రాంతి, ఆతిథ్యం వంటి రంగాల్లో ఉపాధి పెరిగిందని కార్మిక శాఖ నివేదిక తెలిపింది. -
4 శాతం పెరిగిన ఉద్యోగాలు: హైదరాబాద్‌లో ఎంతంటే?
సాక్షి, ముంబై: కరోనా రెండో విడత కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం పడినప్పటికీ, జూన్ మాసంలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్టు ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ అనే నివేదిక తెలియజేసింది. మాన్స్టర్ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా రెండో దశ, లాక్డౌన్లు ఉన్నప్పటికీ గడిచిన ఆరు నెలల్లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల్లో వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. 2021 మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఉద్యోగ నియామకాల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. అదే వార్షికంగా 2020 జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నియామకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. రానున్న రోజుల్లో ఆశావహ పరిస్థితులు ఉండొచ్చని అంచనా వేసింది. ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటనలు, నియామకాల గణాంకాల ఆధారంగా మాన్స్టర్ సంస్థ ఈ నివేదికను రూపొందిస్తుంటుంది. రంగాల వారీగా.. మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 27 రంగాలకు సంబంధించిన గణాంకాలను ప్రతీ నెలా తన అంచనాల్లోకి తీసుకుంటుంది. జూన్‌లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగ నియామకాలు మే నెలతో పోలిస్తే సానుకూలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దిగుమతులు, ఎగుమతుల రంగంలో 25 శాతం, తయారీ (14 శాతం), షిప్పింగ్, మెరైన్ (11 శాతం),హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ (10 శాతం) వృద్ధిని చూపించినట్టు వెల్లడించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, రియల్ ఎస్టేట్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లోనూ నియామకాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. పర్యాటకం, రవాణా రంగంలోనూ మే నెలతో పోలిస్తే 3 శాతం మేర నియామకాలు పెరిగినట్టు తెలిపింది. ఎఫ్ఎంసీజీ, ఆగ్రో పరిశ్రమలు, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రింటింగ్ పరిశ్రమలు నియామకాల్లో ఒక శాతం వృద్ధిని చూపించాయి. వడోదరాలో 9 శాతం, పుణె, కోయింబత్తూర్, చండీగఢ్ తదితర నగరాల్లో నియామకాలు 6 శాతం మేర పుంజుకోగా, బెంగళూరులో 2 శాతం, హైదరాబాద్‌లో ఒక శాతం మేర పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
ఐటీకి కలిసొచ్చిన కరోనా : ఎక్కువ జీతాలు ఎక్కడో తెలుసా?
సాక్షి,ముంబై: కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాల్లో కోలాహలం మొదలైంది. ప్రతి నెలా జాబ్స్ రిక్రూట్మెంట్లో వృద్ధిని నమోదవుతూనే ఉంది. క్రితం నెలతో పోలిస్తే జనవరి నెలలో జాబ్స్ పోస్టింగ్స్‌లో 39 శాతం పెరుగుదల కనబరిచిందని జాబ్స్, బిజినెస్ సొల్యూషన్స్ ఫ్లాట్‌ఫామ్ సైకి తెలిపింది. ఐటీ తర్వాత అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగం బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ). 10 శాతం పెరుగుదలతో బీపీఓ, 6 శాతంతో బ్యాంకింగ్ రంగాలు ఉన్నాయని సైకి పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ వంటి మెట్రో నగరాలలో జాబ్ పోస్టింగ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఈ రంగంలో 50 శాతానికి పైగా ఉద్యోగాలున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా జాబ్ పోస్టింగ్ డేటాను విశ్లేషించింది. (రిలయన్స్ సంచలన నిర్ణయం) ఎక్కువ జీతాలు హైదరాబాద్, బెంగళూరులోనే.. అత్యధిక వేతనాలను అందించే నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. ఐటీ ఉద్యోగాలకు రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ పారితోషకాలను ఇచ్చే నగరాలివేనని తెలిపింది. ఐటీ రంగంలో 47 శాతం ప్రాజెక్ట్ మేనేజర్లకు డిమాండ్ ఉంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్లో 6 శాతం, బ్యాంకింగ్‌లో 4 శాతం, రిక్రూట్మెంట్లో 3 శాతం డిమాండ్ ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ 30 శాతం నియామకాలతో అగ్రస్థానంలో ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి పొందండంలో ఐటీ రంగం అసాధరణమైన పురోగతిని సాధించింది. డిజిటల్ పరివర్తనం, రిమోట్ వర్క్ వంటి వాటితో అనేక రంగాల ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో ఐటీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని సైకి కో-ఫౌండర్ అక్షయ్ శర్మ తెలిపారు. చదవండి: జూమ్ కితకితలు : ప్యాంట్ లేకుండానే -
అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్‌లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్‌లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది.