
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో కేవలం 1.08 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో సూచీలోని వస్తువుల బాస్కెట్ మొత్తం ధర కేవలం 1.08 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 25 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2017జూన్‌లో 0.9 శాతం) టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార వస్తువుల ధరలు అదుపులోఉండడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.27 శాతం అయితే, ఈ ఏడాది జూన్‌లో ఈ రేటు 2.02 శాతంగా ఉంది.