వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది.. దీంతో సింగరే ణి వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం
జూలై నాటికి రూ.166కోట్ల నష్టం
Published Tue, Sep 3 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
మంచిర్యాల అర్బన్/రెబ్బెన(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది.. దీంతో సింగరే ణి వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం జూలై నాటికే కంపెనీకి రూ.166 కోట్ల నష్టం వాటిల్లిందని డెరైక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి వెనుకబాటును అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు ఆయన సోమవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన ప్రారంతాల్లోని పర్యటించారు. ఆయా ఏరియాల మేనేజర్లు, ఇతర అధికారుల తో చర్చలు జరిపి పలు సూచనలు చేశా రు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించటంలో ఓసీపీలు వెనుకబడటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఓపెన్‌కాస్ట్ ప్రా జెక్టుల్లో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి కి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూ చించారు. క్వారీల్లోకి చేరే వర్షపు నీటిని ఎప్పటికప్పుడూ అధిక సామర్థ్యం కలిగి న మోటర్ల సహాయంతో బయటికి పం పాలని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలతో పాటు, కార్మిక శక్తిని సక్రమంగా వినియోగించుకుని ఉత్పత్తి ప్రక్రియ కొనసాగిం చాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలంలో ఉత్పత్తిని వేగవం తం చేయాలన్నారు. డెరైక్టర్ వెంట ఏరియా జనరల్ మేనేజర్ జనగాం నాగ య్య, ప్రాజెక్టు అధికారులు కొండయ్య, సంజీవరెడ్డి, ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాస్‌రావు, ఏజీఎం ఈఅండ్‌ఎం నిర్మల్ కుమార్, డీజీఎం వర్క్‌షాప్ నీలకంఠేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
ఉత్పత్తిలో జాతీయ రికార్డు
సీసీసీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్‌కే న్యూటెక్ గనిలో ఒక్క రోజు లోనే షాట్‌వాల్ యంత్రం ద్వారా 2400 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జాతీ య స్థాయి రికార్డు అని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం భూ సేకరణ త్వరితగతిన చేపడతామని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమిం చడానికి రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం నాగేశ్వర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement