భూమిపై అత్యంత వేడి నెలగా జూలై | July recorded as highest temparature month after earth born | Sakshi
Sakshi News home page

భూమిపై అత్యంత వేడి నెలగా జూలై

Published Thu, Aug 18 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

July recorded as highest temparature month after earth born

మియామి: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలై నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్‌ఓఏఏ) ప్రకటించింది.

నాసా తాజాగా వెల్లడించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించాక ఎన్‌ఓఏఏ తన నెలవారీ నివేదికను విడుదలచేసింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11 డిగ్రీలు ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ నెల భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement