సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు.
మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!)
కాగా ఓలా ఎస్1 ఎయిర్‌ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్‌లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్‌మెంట్)
Test drove the first S1 Air vehicles!! Loving them 🙂
— Bhavish Aggarwal (@bhash) May 23, 2023
Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62
Comments
Please login to add a commentAdd a comment