
భారత్‌లో యాపిల్ వాచ్ ఎంతో తెలుసా?
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించిన స్మార్ట్ వాచీలు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
*ప్రారంభ రేటు రూ. 30,000
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించిన స్మార్ట్ వాచీలు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుండటమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ప్రాథమిక మోడల్ ధర భారత్‌లో రూ. 30,000 పైచిలుకు ఉండగలదని అంచనా. స్టీల్, అల్యూమినియం, పసిడి వేరియంట్స్‌తో యాపిల్ మూడు వాచీలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు 349 డాలర్లు (సుమారు రూ. 21,800) నుంచి 17,000 డాలర్లు (దాదాపు రూ. 10.66 లక్షలు) దాకా ఉంటాయని కంపెనీ తెలిపింది.