మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలను పెంచుతూ గతేడాది జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల (జీవోఎంస్ 3)ను ప్రభుత్వం సవరించింది.
సాక్షి, హైదరాబాద్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలను పెంచుతూ గతేడాది జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల (జీవోఎంస్ 3)ను ప్రభుత్వం సవరించింది. వేతనాల పెంపు 2014 ఏప్రిల్ 1నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నందున పాత ఉత్తర్వును సవరిస్తూ ప్రభుత్వం సోమవారం వేరొక ఉత్తర్వును జారీచేసింది. కూలీల రోజువారీ వేతనాన్ని రూ.169కి పెంచుతూ జారీచేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.