సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్‌మార్కెట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.
దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్‌వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది.
ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది.
ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది.
We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations.
— Akasa Air (@AkasaAir) July 7, 2022
Comments
Please login to add a commentAdd a comment