ఈ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసా? | Bank Holidays In July 2024: Branches To Remain Shut For 12 Days | Sakshi
Sakshi News home page

ఈ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసా?

Published Sun, Jun 23 2024 7:48 AM | Last Updated on Mon, Jul 1 2024 3:20 PM

Bank Holidays In July 2024: Branches To Remain Shut For 12 Days

Bank Holidays in July 2024: జూలై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ జాబితాను సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా బ్యాంకులు ఈ సెలవులను నిర్ణయిస్తాయి.

దేశంలోని అన్ని బ్యాంకులు, శాఖల్లో సాధారణ వారాంతపు సెలవులు వర్తిస్తాయి. అన్ని ఆదివారాలతో పాటు పండుగలు, జాతీయ సెలవు దినాలు, రెండు, నాలుగో శనివారాలు వంటి వారాంతపు సెలవులు ఈ జాబితాలో ఉన్నాయి.

జులై సెలవుల జాబితా ఇదే..
» జూలై 3 బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు
» జులై 6 ఎం.హెచ్.ఐ.పి డే సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు
» జులై 7 ఆదివారం దేశం అంతటా సెలవు
» జులై 8 కాంగ్ (రథజాత్ర) సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు
» జులై 9 ద్రుప్‌కా షిజి సందర్భంగా గ్యాంగ్ టక్‌లో సెలవు 
» జులై 13 రెండో శనివారం దేశం అంతటా సెలవు
» జులై 14 ఆదివారం దేశం అంతటా సెలవు
» జులై  16 హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో సెలవు
» జులై 17 మొహర్రం/అషూరా/యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సెలవు
» జులై 21 ఆదివారం దేశం అంతటా సెలవు
» జులై 27 నాల్గవ శనివారం దేశం అంతటా సెలవు
» జులై 28 ఆదివారం దేశం అంతటా సెలవు

ఈ సెలవులను బ్యాంకుల భౌతిక శాఖలలో పాటిస్తారు. అయితే ఈ సెలవు రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవల ద్వారా కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement