సాక్షి, సంగారెడ్డి: పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు భారీ వృద్ధిని సాధించినట్లు భూగర్భ జల శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది జూలైలో భూ ఉపరితలానికి 20.37 మీటర్లు దిగువన నమోదైన జిల్లా సగటు భూగర్భ జల మట్టం.. ఈ ఏడాది జూలై నాటికి 5.10 మీటర్ల మేర వృద్ధి సాధించింది. అదే విధంగా గత ఏడాది జూన్‌లో 23.79 మీటర్లు నమోదైన భూగర్భ జల మట్టం ఈ ఏడాది జూన్‌లో 19.53 మీటర్లకు ఎగబాకింది. ఈ సీజన్‌లో వర్షపాతం 18 మండలాల్లో సాధారణానికి మిం చిపోగా 20 మండలాల్లో సాధారణానికి చేరుకుంది. మిగలిన 13 మండలాల్లో వర్షపాతం ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోయినా.. ఎక్కడా వర్షభావం మాత్రం నెలకొనలేదు. వాగులు, వంకలపై నిర్మించిన చెక్ డ్యాంలు, వాటర్‌షెడ్ ట్యాంకులకు జలకళ వచ్చింది. భూగర్భ జలాల వృద్ధి చెందడంతో వ్యవసాయ బావులు నిండు కుండళ్లా కళకళలాడుతున్నాయి. మరికొన్ని చోట్లలో బావుల నుంచి నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి.
ఉబికివస్తున్న జలాలు...
మనూరు మండలం పసుపులపాడులో వ్యవసాయ బావి పొంగింది. ఆ గ్రామంలో భూ గర్భ జలాలు భూ ఉపరితలానికి 0.45 మీటర్లు లోతుకే లభ్యమవుతున్నాయి. రేగోడ్ మం డలం టి.లింగంపల్లిలో 0.80 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూరులో 1.50 మీటర్లు, ఝరాసంఘంలో 4.20 మీటర్లు, పెద్ద శంకరంపేటలో 5.20 మీటర్లు, చిన్న శంకరంపేట మండలం గవ్వపేటలో 5.59 మీటర్లు, పాపన్నపేటలో 6.17 మీటర్లు, శివ్వంపేటలో 6.64 మీటర్లు, వర్గల్ మండలం మజీద్‌పల్లిలో 8.09 మీటర్లు, సిద్దిపేటలో 8.74 మీటర్లు దిగువన భూగర్భజలాల మట్టం నమోదైంది. భూ గర్భ జల మట్టాలు అత్యంత దిగువన నమోదైన ప్రాంతాలను పరిశీలిస్తే..గజ్వేల్‌లో 33.60 మీటర్లు, ములుగులో 32.60 మీటర్లు లోతున భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి.
విషమం నుంచి ఉపశమనం
ఓ ప్రాంతంలో భూగర్భ జలాల లభ్యత, విని యోగం ఆధారంగా భూగర్భ జలాల పరిస్థితిని నిర్ధారిస్తారు. వినియోగం అధికమైతే ఆ ప్రాం తాలను అతి విషమం, విషమ పరిస్థితిలో ఉన్న ట్లు ప్రకటించి అక్కడ కొత్తగా బోరుబావుల తవ్వకాలపై నిషేధాన్ని అమలుచేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వి నీటిని తోడేస్తుండటంతో వేసవికాలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో పడిపోతున్నాయి. కురిసిన వర్షాల వల్ల ఇలాం టి ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాల స్థితి గతులు మెరుగయ్యాయి. మనూరు మండలం పసుపులపాడు, ఝరాసంఘం, పాపన్నపేట, తూప్రాన్ ప్రాంతాలు ఈ కోవకు వస్తాయి.
భూగర్భ జలమట్టాల్లో భారీ పెరుగుదల
Published Tue, Aug 13 2013 5:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement