
న్యూఢిల్లీ: జులైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మోదీ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన ఒక రోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అదికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవలే మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇటలీకి వెళ్లొచ్చారు.