విస్తారంగా వర్షాలు
Published Fri, Jul 29 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. 45 మండలాల్లో 10 మి.మీ. పైగా నమోదు కావడం విశేషం. ఆదోనిలో అత్యధికంగా 59.4 మి.మీ., సంజామలలో 2.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. జిల్లా మొత్తంగా సగటున ఒకే రోజు 23.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూలై సాధారణ వర్షపాతం 117.2 మి.మీ. 114 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 20 అరకొర వర్షాలతో సరిపెట్టినా ఈ వారంలో సాధారణ స్థాయి మేరకు వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. అయితే సంజామల, ఆళ్లగడ్డ, ఓర్వకల్, కల్లూరు, రుద్రవరం, గోస్పాడు, శ్రీశైలం తదితర మండలాల్లో అరకొర వర్షాలే గతయ్యాయి. కోసిగి 54.8, నందవరం 47, సి.బెళగల్ 45, డోన్ 44.2, నందికొట్కూరు 39.4, పగిడ్యాల 39.4, మిడుతూరు 37.2, ఓర్వకల్ 37.2,
వెలుగోడు 36.8, హŸళగుంద 36.4, ఆత్మకూరు 36.2, క్రిష్ణగిరి 35.4, దొర్నిపాడు 34, ఆలూరు 33.4, ప్యాపిలి 32.6, హాలహర్వి 31.4,
జూపాడుబంగ్లా 30.2 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది.
Advertisement
Advertisement