జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
Published Sun, Sep 25 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
–46 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి కూడా వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దాదాపు 46 మండలాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కొత్తపల్లిలో 30 మీ.మీ. వర్షపాతం నమోదు అయింది. ఆళ్లగడ్డలో 21.8, ఉయ్యలవాడలో 19, ఆలూరులో 18, బేతంచెర్లలో 16, దొర్నిపాడులో 16, పాములపాడులో 15.4, కర్నూలులో 13.4, కల్లూరులో 13.4, మిడుతూరు 13.2, ఓర్వకల్‌లో 13.2, వెల్దుర్తిలో 12.8, కోవెలకుంట్లలో 12.6, పెద్దకడుబూరులో 12.2, మంత్రాలయంలో 11.8, తుగ్గలిలో 10.6, శ్రీశైలంలో 10.4 మిమీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ. ఉండగా 138.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.
Advertisement