కుండపోత
కుండపోత
Published Fri, Sep 23 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
– ఆత్మకూరులో అత్యధికంగా 85మి.మీ వర్షపాతం నమోదు
– పొంగిన సుద్ద, బవనాశి వాగులు
– నంద్యాలలో పొంగిన చామకాల్వ
– లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయం
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆత్మకూరులో 85 మిమీ వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల వల్ల సుద్దవాగు, బవనాశి వాగులు పొంగిపొర్లడంతో కొత్తపల్లి, ఆత్మకూరులకు దాదాపు 10 గ్రామాలకు గురువారం మధ్యాహ్నం వరకు రాకపోకలు బంద్ అయ్యాయి. నంద్యాలలో భారీ వర్షం కురవడంతో చామ కాల్వ పొంగి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. భారీగా నీరు చేరి 60 ఇళ్లలో ధాన్యం, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఆత్మకూరు, నంద్యాల, వెలుగోడు తదితర మండలాల్లో భారీ వర్షాలు పడటంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లా మొత్తం మీద 16.3 మిమీ వర్షపాతం న మోదు అయింది.
వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి....
ప్రాంతం వర్షపాతం
ఆత్మకూరు 85 మిమీ
నంద్యాల 51.6
వెలుగోడు 50.8
మహనంది 46.4
శిరువెళ్ల 42.8
బండిఆత్మకూరు 42.2
కొత్తపల్లి 42
పాములపాడు 40.2
గడివేముల 31.2
రుద్రవరం 28.4
ఉయ్యలవాడ 26.2
చాగలమ్ర రి 25.6
గోస్పాడు 20.6
హŸళగొంద, ఆలూరు, పగిడ్యాల, పాణ్యం, శ్రీశైలం, మిడుతూరు, ఓర్వకల్లు, ఆళ్లగడ్డ,నందికొట్కూరు తదితర మండలాల్లో కూడా ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. కోసిగి, నందవరం, పెద్దకడుబూరు, చిప్పగిరి మండలాలు మినహా మిగిలిన 50 మండలాల్లో వర్షాలు కురిశాయి. గురువారం సాయంత్రం కూడా జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురిశాయి. సెప్టంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మిమీ ఉండగా ఇప్పటి వరకు 118.4 మిమీ వర్షపాతం నమోదు అయింది.
Advertisement