
వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన
జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటన ఖరారైంది. జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు. ప్రధాని కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మోడీ తొలి విదేశీ పర్యటనకు ఈ నెలాఖరులో భూటన్ వెళ్లనున్నారు. ఇక సెప్టెంబర్ చివర్లో అమెరికాకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించగా.. మోడీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లే ముందుగా మోడీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు.