domestic industry
-
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్‌లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి
న్యూఢిల్లీ: భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్‌పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు. ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ వచ్చే బడ్జెట్లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్‌ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మంత్రి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
ట్రంప్‌తో భయమేమీ లేదు: పరిశ్రమలు
న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించడంపై దేశీయ పరిశ్రమ అభినందనలు తెలిపింది. అరుుతే అమెరికా మార్కెట్లో భారత ఫార్మా ఉత్పత్తుల్ని మరింత అనుసంధానించటం, నైపుణ్య ఉద్యోగుల సాఫీ రవాణాకు వీలు కల్పించటం చేస్తారనే ఆకాంక్ష వ్యక్తం చేసింది. ట్రంప్ విషయంలో నెలకొన్న భయాందోళలన్నీ తప్పని తేలినట్టు పేర్కొంటూ... ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ట్రంప్ పాలనలో భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం నూతన శిఖరాలకు చేరుతాయనే నమ్మకాన్ని ఫిక్కీ వ్యక్తం చేసింది. పరిష్కారమవుతాయని భావిస్తున్నాం.. నైపుణ్య కార్మికుల వలసలు, దేశీయ ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ ప్రవేశం, ఆర్థిక సేవలు, ఎస్ఎంఈలకు సంబంధించిన సవాళ్లు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ఉన్నాం. అమెరికాకు సంబంధించి రక్షణ సహకారం, నైపుణ్య కార్మికుల రవాణా వంటివి ప్రధానంగా దృష్టి సారించే అంశాలు. వీటిపై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ సర్కారుతో పనిచేసేందుకు చూస్తున్నాం. - నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ ప్రెసిడెంట్ ట్రంప్ పట్ల నమ్మకం ఉంది.. ప్రపంచ దేశాలతో పారదర్శక ఒప్పందాలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ మాటలు నమ్మశక్యంగా ఉన్నారుు. ఫైనాన్షియల్ మార్కెట్లు తొలుత తీవ్ర భయాందోళన చెందినప్పటికీ తర్వాత కోలుకోవడం అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ట్రంప్ దగ్గర గొప్ప కార్యచరణ ఉందన్న నమ్మకం కలగడం వల్లే. - సునీల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ ఇంజినీరింగ్ ఎగుమతులకు జోష్.. మౌలిక సదుపాయాలైన హైవేలు, విమానాశ్రయాలు వంటి వాటిపై పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తానని ట్రంప్ ప్రకటించారు. దాని వల్ల స్టీల్, మెషినరీ, ఉన్నత సాంకేతికత అరుున ఇంజనీరింగ్ ఎగుమతులకు భారీ డిమాండ్ ఉంటుంది. - టీఎస్ భాసిన్, ఇంజనీరింగ్ ఎగుమతుల మండలి (ఈఈపీసీ) చైర్మన్ వాణిజ్యం బలోపేతమవుతుంది గత దశాబ్దకాలంలో ద్వైపాక్షిక, ఆర్థిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య మెరుగుపడ్డ సంబంధాలను ట్రంప్ మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం సాకారానికి, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి సరికొత్త అవకాశాల అన్వేషణపై తాజా చర్యలు చేపట్టాల్సి ఉంది. - రాణా కపూర్, యస్ బ్యాంకు ఎండీ మన ఐటీకి ఇబ్బంది ఉండదు అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం.. స్వల్పకాలంలో భారత ఐటీ పరిశ్రమ నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వాగ్దానాలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయో తెలియదు. అత్యుత్తమ డొమైన్ పరిజ్ఞానం, ప్రతిభ, వ్యయ నియంత్రణ అనేవి మన ఐటీ కంపెనీల బలం. వీటిని బట్టి చూస్తే మన ఐటీ పరిశ్రమ అమెరికాకు చాలానే ఇచ్చింది. దీన్ని వారు మరువరు. - అజయ్ కొల్లా, సీఈఓ- విస్డమ్జాబ్స్.కామ్