కొచ్చి: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సంతోష్ రావూరి జోడికి టైటిల్ దక్కింది. ఇక్కడి రీజినల్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. పూర్విషా (కర్ణాటక)తో కలిసి రెండో సీడ్‌గా సంతోష్ బరిలోకి దిగాడు.
ఫైనల్ మ్యాచ్‌లో ఈ జంట 21-12, 25-23 స్కోరుతో ఐదో సీడ్ వినయ్ కుమార్ సింగ్-ప్రజ్ఞా రాయ్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించారు. అయితే అండర్-19 బాలుర డబుల్స్‌లో సంతోష్‌కు చుక్కెదురైంది. ఫైనల్లో సంతోష్-చైతన్య రెడ్డి (ఏపీ) జంట 14-21, 19-21తో అరుణ్ జార్జ్ (కేరళ)-ఆదిత్య జోషి (ఎయిరిండియా) చేతిలో పరాజయం పాలైంది. అండర్-17 బాలికల డబుల్స్ ఫైనల్లో ఏపీకి చెందిన డి. పూజకు ఓటమి ఎదురైంది. పూజ-కరిష్మా (మహారాష్ట్ర) జంటపై 21-17, 21-12తో మహిమ అగర్వాల్ (కర్ణాటక)- శిఖా గౌతమ్ (మహారాష్ట్ర) జోడి గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది.
మిక్స్‌డ్‌లో సంతోష్ జోడికి టైటిల్
Published Mon, Aug 5 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement