న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు రెండింతలు కానున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ గ్రామీణ భారతాన్ని అనుసంధానించనుంది. దీంతో రెండేళ్లలో ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 150 కోట్లకు చేరనుంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్‌తో అనుసంధానించిన అతిపెద్ద దేశం భారత్. ఇంట్రానెట్ కారణంగా చైనా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదు.
భారత్‌లో ప్రస్తుతం 80 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపిస్తుంది. డేటా ప్రొటెక్షన్ బిల్లు డిసెంబర్‌లోగా రానుంది. నైతిక విలువలు, అలాంటి విషయాలు పట్టింపు లేని దేశాల నుండి కాకుండా భారతదేశం నుండి వచ్చే ఏఐ సాంకేతికతలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. డేటా గోప్యతను ప్రాథమిక హక్కుగా మనం పొందాము. చైనాలో అందుకు భిన్నం’ అని అసోచాం కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment