
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లోనూ పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి 77వ ర్యాంకర్ సాకేత్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో బరిలోకి దిగాడు.
యూఎస్ ఓపెన్‌లో మాత్రం యూకీతో కాకుండా కరత్‌సెవ్ (రష్యా)తో సాకేత్ జత కట్టాడు. బ్రెజిల్ ప్లేయర్ డెమోలైనర్‌తో కలిసి యూకీ ఆడనున్నాడు. 35 ఏళ్ల సాకేత్ 2016 యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్‌లో నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment