నాదల్‌కు స్వర్ణం
రియో డి జనీరో: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో ఒలింపిక్స్ స్వర్ణం గెలుపొందాడు. దీర్ఘకాల మిత్రుడు మార్క్ లోపేజ్‌తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. రొమేనియా జోడి మెర్జియా, హోరియాలతో జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో.. ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ గెలిచిన నాలుగో టెన్నిస్ స్టార్‌గా (సెరెనా, వీనస్, నికోలస్ మస్సు) నిలిచాడు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్‌లో స్వర్ణం అందుకున్నాడు. అటు పురుషుల సింగిల్స్‌లోనూ బ్రెజిల్ క్రీడాకారుడు థామస్ బెలూచీపై 2-6, 6-4, 6-2తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే సెమీస్‌లో జపాన్ ప్లేయర్ కీ నిషికోరీపై 6-1, 6-4తో గెలిచి ఫైనల్ చేరాడు. కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో పుయెర్టోరికో క్రీడాకారిణి, మోనికా ప్యూగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్ బంగారు పతకం కోసం పోటీపడనున్నారు.