ముంబై: డీమ్యాట్ ఖాతాలు 2019 మార్చి నుంచి 2021 నాటికి రెట్టింపైనట్టు సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి చెప్పారు. 2019 మార్చి నాటికి 3.6 కోట్లుగా ఉన్న ఖాతాలు 2021 నవంబర్ నాటికి 7.7 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్యాగి మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ధోరణుల మాదిరే భారత్‌లోనూ వ్యక్తిగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లలోకి రావడం గణనీయంగా పెరిగింది. 2019–20లో సగటున ప్రతీ నెలా 4 లక్షల చొప్పున డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021లో ఇది ప్రతీ నెలా 20 లక్షలకు పెరిగింది. 2021 నవంబర్‌లో ఇది 29 లక్షలకు చేరుకుంది’’అని వివరించారు. చక్కగా రూపొందించిన ఇండెక్స్ మార్కెట్ పనితీరును అంచనా వేయడంతోపాటు, పెట్టుబడులకు పోర్ట్‌ఫోలి యో మాదిరిగా పనిచేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment