
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం సృష్టించిన చరిత్రాత్మక ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021