
Praja Sankalpa Padayatra Fourth Anniversary: అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ వెనుకాడలేదని గుర్తుచేశారు.
సాక్షి, తూర్పుగోదావరి: ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్రగాప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ వెనుకాడలేదని గుర్తుచేశారు.
చదవండి: సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ
ప్రజలు సీఎం వైఎస్ జగన్‌వైపే నిలిచారని సజ్జల అన్నారు. సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షానికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తి అయింది. నవంబర్6, 2017న ఇడుపులపాయలో ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారు
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారని పేర్కొన్నారు. అధికారం చేపట్టగాలనే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ నడుంబిగించారని తెలిపారు. రూ.లక్షా 40 వేల కోట్లు పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. సాగునీటి సమస్యల లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.