తండ్రి చెంతకు చేరిన శ్యామ్‌రావ్ లోఖండే
అల్లిపురం (విశాఖ దక్షిణ ): చనిపోయాడు అనుకున్న కొడుకు తిరిగి వస్తే ఆ ఆనందం వర్ణణాతీతం. అలాంటి అనుభవం ఒక తండ్రికి కలిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా గ్రామానికి చెందిన శ్యామ్‌రావ్ లోఖండే (38) మతిస్థిమితం లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. అలా వచ్చిన వ్యక్తి నగరంలో తిరుగుతుండగా అతడిని భీమ్‌నగర్ ఏయూటీడీ, టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయ వసతి గృహం సిబ్బంది రక్షించి, మెంటల్ కేర్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందజేశారు.
చదవండి: కన్నతల్లిని నమ్మించి.. 12 లక్షలు కాజేసి!
చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 31న పూర్తి ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయ్యాడు. దీంతో ఆయనకు భీమ్‌నగర్ షెల్టర్‌లో ఆశ్రయం కల్పించారు. అతని వివరాలు తెలుసుకున్న శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు స్వగ్రామం తీసుకెళ్లి తండ్రి ప్రవీణ్‌కు అప్పగించారు. చనిపోయాడనుకున్న శ్యామ్‌రావ్ తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment