అమ్మకోసం..
తల్లికి అరుదైన క్యాన్సర్. చికిత్సలో ఉంది. ఆమె కోసం నాలుగేళ్ల పాప ఓ పాట పాడుతుంది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో తల్లి కోసం ఆ పాప నువ్వు బలం కోల్పోతే... నేనే నీ బలమౌతా... నీ పట్టు జారిపోతే... నేనే నిను ఒడిసి పట్టుకుంటా...అంటూ పాడుతూంటే ఆ తల్లి కళ్ళనుంచి నీళ్లు జలజల రాలాయి. ఆమె నోట అప్రయత్నంగా ఐ లవ్యూ అన్న మాట వెలువడింది.
చూస్తున్న వారంతా గొంతు కలిపారు. అందరి కళ్లలోనూ కన్నీళ్లే... ఎప్పటిదో, ఎక్కడిదో తెలియదు కానీ, ఈ వీడియోను ఎలెన్ డీ జనరస్ షో వారి ఎలెన్‌ట్యూబ్ లో పెట్టగానే ఇరవై నాలుగు గంటల్లో కోటీ తొంభై లక్షల మంది చూశారు. వందలాది వెబ్ సైట్లు దీన్ని షేర్‌చేసుకున్నాయి. మనసు పొరల్లోని అతి సున్నిత భావాలను ఆవిష్కరించిన ఈ విడియోని మీరూ చూడండి.