
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను భారత్ అందుకోగలిగితే దేశ ప్రజల సగటు జీవితకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా దేశం ప్రతి ఏటా రూ.35 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు పేర్కొంది. ప్రజలు అనారోగ్యం బారిన పడి ఆయుర్దాయం తగ్గిపోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కి చెందిన పరిశోధకులు ఓ నివేదిక సమర్పించారు. ఇందులో ఉద్గారాల పర్యవేక్షణకు ఆడిటర్ల నియామకం, కాలుష్యకారకాలపై ప్రజలకు సమాచారం ఇవ్వడం, అదనంగా విడుదలయ్యే ఉద్గారాలపై జరిమానా విధించటం, ఉద్గారాలపై ఎప్పటికప్పడు రెగ్యులేటర్లకు సమాచారం అందించటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు యత్నించే పరిశ్రమలపై భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో 66 కోట్ల మంది అధిక కాలుష్య ప్రాంతాల్లోనివసిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment