స్టార్‌ హీరోయిన్‌కు ప్రమోషన్‌..! | Star heroine’s sister becomes pregnant | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌కు ప్రమోషన్‌..!

Published Tue, Sep 19 2017 6:10 PM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

స్టార్‌ హీరోయిన్‌కు ప్రమోషన్‌..!

స్టార్‌ హీరోయిన్‌కు ప్రమోషన్‌..!

సాక్షి, ముంబై:  టాలీవుడ్‌  అందాల హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు  ప్రమోషన్‌ వస్తోందిట. అవును..త్వరలోనే ఆమె పెద్దమ్మ కాబోతోంది.  కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు మరో హీరోయిన్‌ నిషా అగర్వాల్  తల్లి కాబోతోంది.   తాను తల్లి కాబోతున్న గుడ్‌ న్యూస్‌ను నిషా అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను కూడా షేర్‌ చేసింది.   


ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నిషా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ కాలేకపోయింది.  దీంతో ముంబైకి చెందిన ఒక బిజినెస్‌మేన్‌ను  పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన సంగతి తెలిసిందే.  ఈ  విషయాన్ని కాజల్ ఫ్యామిలీ కూడా ధ్రువీకరించింది.

కాగా  టాలీవుడ్‌ హీరో రానాకు  కాజల్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో  దర్శకుడు తేజ సారధ్యంలో వచ్చిన  'నేనే రాజు నేనే మంత్రి' హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. మరో రెండురోజుల్లో  నాన్‌ అలయిత్తాల్‌ పేరుతో   కోలీవుడ్‌ లో కూడా సెప్టెంబర్‌ 22న  విడుదల కానుంది. మరోవైపు  ముంబైలో జరుగనున్న రివర్స్‌ ర్యాలీలో వీరిద్దరూ పాల్గొనబోతున్నారు.  ఈ ర్యాలీకి మద్దతు తెలిపాల్సిందిగా కోరుతూ అక్కా చెల్లెళ్లిద్దరూ (కాజల్‌ అండ్‌ నిషా) ట్విట్టర్‌లో ఒక  వీడీయోను   షేర్‌ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement