కర్ణాటక, యశవంతపుర : దోపిడీ, దొంగతనాలు, హత్యాయత్నం కేసులో నిందితుడు చిన్నారి కొడుకు (3)కి మద్యం తాగించిన సంఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. మాగడిరోడ్డుకు చెందిన రౌడీషీటర్ కుమారేశ్‌కు కొంతకాలం కిందట పెళ్లయింది. వారికో కొడుకు పుట్టాడు. కుమారేశ్ రౌడీషీటర్ కావడం, తరచూ వేధిస్తుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి వద్ద ఉన్న కొడుకును ఇటీవల ఆమెకు తెలియకుండా కుమారేశ్ తీసుకెళ్లాడు. బిడ్డను అప్పగించాలని ఆమె కోరినా ఇవ్వలేదు. ఇటీవల ఇంట్లో స్నేహితులతో కలిసి అతడు మద్యం తాగుతూ, కొడుక్కి కూడా మందు పట్టించాడు. ఆ వైనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. భార్యపై ఉన్న కోపంతో అణ్యంపుణ్యం ఎరుగాని చిన్నారికీ మద్యం తాపిస్తున్న వీడియోను బంధువులతో పాటు భార్యకూ పంపాడు. భర్త దురాగతంపై ఆమె వనితా సహాయవాణి, పిల్లల సహాయవాణికీ ఫిర్యాదు చేయగా, స్పందించిన పోలీసులు చిన్నారినీ రక్షించి తల్లి చెంతకు చేర్చారు. మాగడి రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు కుమారేశ్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment