
చికిత్స పొందుతున్న మోహన్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పూలమార్కెట్‌కు చెందిన మోహన్ అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. చవితిను పురస్కరించుకుని బజారువీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మోహన్ అతని అనుచరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు రోడ్డులోని కట్టెలదొడ్డికి చెందిన శరవణ అనే వ్యక్తి ఊరేగింపులో పాల్గొని గొడవ చేశాడు. దీనిపై మోహన్, శరవణల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో శరవణ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని మోహన్ తలను నరకడానికి ప్రయత్నించాడు.
ఇంతలో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐ మోహన్‌ను పక్కకు తోసేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా శరవణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని మోహన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు గాయపడ్డ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడు కావడంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment