అడ్డుగా ఉన్నాడని... భర్తపై హత్యాయత్నం | Wife And Her Boyfriend Murder Attempt on Husband in Karnataka | Sakshi
Sakshi News home page

భర్తపై హత్యాయత్నం

Published Tue, Jan 8 2019 12:31 PM | Last Updated on Tue, Jan 8 2019 12:31 PM

Wife And Her Boyfriend Murder Attempt on Husband in Karnataka - Sakshi

పట్టుబడిన నిందితులు

కర్ణాటక, కృష్ణరాజపురం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ఓ మహిళ, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తపై హత్యాయత్నం చేసిన ఘట న సోమవారం హుళిమావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు... కూలిగా పనిచేస్తున్న నాగరాజు భార్య మమతతో కలిసి అరికెరెలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటి యజమాని ప్రశాంత్‌తో మమతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

విషయం నాగరాజుకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి పథకం వేసింది. మమత సూచన మేరకు ప్రశాంత్‌ తన సహచరులు అనిల్, జాకిర్, హరీశ్‌లతో కలసి గతనెల14న నాగరాజును హత్య చేయడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో వాటర్‌క్యాన్‌ సరఫరా చేసే వ్యక్తి అక్కడికి రావడంతో హత్యాయత్నాన్ని విరమించుకొని అనుమానం రాకుండా ఉండడానికి నాగరాజుపై దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న హుళిమావు పోలీసులు మమత ప్రవర్తనపై అనుమానించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం మమతతో పాటు ప్రశాంత్‌ అతడి సహచరులను అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement