
గాయపడిన రాజేశ్వరి
శ్రీకాకుళం, బూర్జ: కోడలిపై మామ హత్యాయత్నం చేసిన ఘటన బూర్జ మండలం ఏపీపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద చాకలి కులానికి చెందిన నవిరి రాజేశ్వరి, భర్త పారయ్య ఉపాధి కోసం కుటుంబంతో చెన్నై వెళ్లి సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10న స్వగ్రామమైన ఏపీపేట చేరుకున్నారు. పండగ అనంతరం తన కన్నవారింటికి వెళ్తామని భార్య, వెళ్లవద్దని భర్త గొడవపడ్డారు.
ఇంతలో మద్యం మత్తులో ఉన్న పారయ్య తండ్రి రామారావు ఇద్దరిని ఓదార్చడంపోయి మరింత గొడవ చేశాడు. ఈ క్రమంలోనే కత్తితో రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో గుండె, గొంతుపై బలమైన గాయాలు కావడంతో బాధితురాలిని వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌ఐ జి.భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment