అమలాపురం రూరల్ :యువకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి రౌడీషీటర్‌తో పాటు నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రౌడీషీటరు పినిశెట్టి రవిరాజా, గుండుమోగుల రామాంజనేయులు వర్గాల మధ్య వివాదం ఉంది. రవిరాజా వర్గానికి చెందిన ఎండీ నబీపై గుండుమోగుల రామాంజనేయులు, పెనుమాల ప్రసాద్, దొంగ దుర్గాప్రసాద్, శిరంగు ఆంజనేయులు తదితరులు అమలాపురం రోహిణీ ఆస్పత్రి సమీపంలో బుధవారం ఉదయం కత్తులతో దాడి చేశారు.
ఈ ఘటనలో నబీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. అనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది దీపావళి రోజు ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో రామాంజనేయులు వర్గానికి చెందిన కొలగాని నాయుడును హత్య చేసేందుకు గత నెలలో ఈదరపల్లి వద్ద రవిరాజా వర్గీయులు రెక్కీ నిర్వహించారు. అయితే నాయుడు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ నేపథ్యంలో నబీపై రామాంజనేయులు వర్గీయులు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రామాంజనేయులు, దుర్గా ప్రసాద్, అంజనేయులు, ప్రసాద్‌లపై హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
యువకుడిపై హత్యాయత్నం
Published Fri, Oct 10 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement