తండ్రీకొడుకులపై హత్యాయత్నం
Published Thu, Jan 2 2014 3:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
కొత్తపేట, న్యూస్‌లైన్ :పాత కక్షల నేపథ్యంలో తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో హత్యాయత్నం చేసిన ఉదంతమిది. కొత్తపేట ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం పలి వెల పెదపేటకు చెందిన సాదే నాగేశ్వరరావు, అతడి కుమారుడు రాజ్‌కుమార్ వ్య వసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి పై అదే గ్రామానికి చెందిన వస్కా వెంకన్నతో పాటు ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డా రు. ఇరువర్గాల మధ్య పాత గొడవలున్నా యి. మంగళవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు ఇంటి ముందు రాజ్‌కుమార్, అతడి చెల్లెలు ముగ్గులు పెడుతున్నారు.
అదే సమయంలో వస్కా వెంకన్న, అతడి వర్గీయులు అక్కడకు వెళ్లి వారి ముగ్గులను పాడు చేశారు. దీంతో సాదే నాగేశ్వరరావు, వస్కా వెంకన్న వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వెంకన్న వర్గీయులు కర్రలు, కత్తులతో నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌లపై విరుచుకుపడ్డారు. నాగేశ్వరరావుకు ఎడమ డొక్కలో, రాజ్‌కుమార్‌కు మూడు చోట్ల కత్తిపోట్లయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించగా ప్రా థమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి రెండు కత్తులు, గొడ్డలి, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరా రీలో ఉన్నారు. సంఘటన స్థలాన్ని రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు పరి శీలించారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement