పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని యానాం సబ్‌జైలులోని ఒక జీవిత ఖైదీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు.
కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని యానాం సబ్‌జైలులోని ఒక జీవిత ఖైదీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం పుదుచ్చేరికి చెందిన 14 మంది దుండగులు పాండిచ్చేరికి చెందిన మణికంఠ అనే జీవిత ఖైదీని హత్య చేయాలన్న ఉద్దేశంతో ఈ తెల్లవారుజామున అక్రమంగా జైలులోకి ప్రవేశించారు. జైలు వెనుక భాగం నుంచి ప్రవేశించినవారు వార్డెన్‌ను తాళ్లతో బంధించారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
యానాం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 13 మందిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు అశ్విన్ కోసం గాలిస్తున్నారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. అతనిని హతమార్చేందుకే వచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం.