ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం | son tries to kill father in bhadradri district tekulapally | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం

Published Mon, Oct 24 2016 9:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చబోయాడు.

టేకులపల్లి : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చబోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పంచాయతీలో జరిగింది. బిల్లుడు తండాకు చెందిన భూక్యా పంతు(80), అతని కొడుకు తార్యాకు ఆస్తి విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా తగాదా జరిగింది. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తండ్రిపై తార్యా కత్తితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావటంతో 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement