బాధితురాలు సరోజమ్మ
ఆధునికత ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా పల్లె జనాలను మూఢనమ్మకాలు వెంటాడుతున్నాయి. లేని వాటి కోసం మనిషి చేసే ప్రయత్నంలో వారికి వారే నాశనం అవుతున్నారు. నర బలి ఇస్తే లంకె బిందెలు దొరుకుతాయని నమ్మి అన్నెం పున్నెం ఎరుగని మూగ మహిళను హతమార్చేందుకు సిద్ధపడ్డారు.
సాక్షి, శ్రీరంగరాజపురం: లంకె బిందెల కోసం మూగ మహిళను బలి ఇచ్చేందుకు యత్నించిన సంఘటన మండలంలోని వడ్డికండ్రిగ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు కొందరు వ్యక్తులు లంకె బిందెల వేటలో పడ్డారు. ఈ నేపథ్యంలో సరోజమ్మ అనే మూగ మహిళను బలి ఇచ్చి పూడ్చేందుకు సిద్ధపడ్డారు. గత శుక్రవారం సమీపంలోని పెద్ద చెరువులో గుంతను తవ్వారు. (పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య)
గ్రామానికి చెందిన తల్లీకొడుకు సహకారంతో సరోజనమ్మను పూడ్చేందుకు తీసుకెళ్లారు. తనకు ప్రమాదం వాటిల్లుతోందని అప్రమత్తమైన బాధితురాలు అక్కడ నుంచి తప్పించుకుంది. ఊర్లోకి వెళ్లి తన సైగల ద్వారా బంధువులకు విషయం తెలిపింది. తనను బలిచ్చేందుకు సిద్ధం చేసిన ప్రాంతాన్ని చూపించింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొందరు రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment