
కొరమలో పోలీసుల పహారా
భామిని: అధికార పార్టీ నాయకులు మరోసారి వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి చేశారు. తనపై హత్యాయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ నాయకుడు అగతముడి శేషగిరి పోలీస్‌లకు సోమవారం ఫిర్యాదు చేశారు. శేషగిరి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొరమలో టీడీపీ నాయకులు శేషగిరి, అతని భార్య విశాలాక్షిపై దాడి చేశారు. వీరు కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది ఇంటికి చేరిన సమయంలో మరోసారి వీరిపై దాడి చేశారు. వీరిని మళ్లీ కొత్తూరు ఆస్పత్రికి తరలించారు.
ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బత్తిలి ఏఎస్సై విశ్వనాథం కేసు నమోదు చేశారు. కాగా కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను వైఎస్సార్‌సీపీ నాయకులు బత్తిలి సర్పంచ్ టింగ అన్నాజీరావు, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు అగతముడి రఘుపతి నాయుడు పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
కొరమలో పోలీస్ పికెటింగ్
వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొరమలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పాతపట్నం సీఐ బి.వి.వి ప్రకాశరావు, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో పహారా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment