
ఎమ్మెల్యేపై హత్యాయత్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి : మానామధురై ఇండియన్ బ్యాంక్ ఏటీఎం సమీపంలోని ఒక జిరాక్స్ దుకాణం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే పిచ్చాపాటి మాట్లాడుతున్నా రు. అన్నాడీఎంకే దివంగత నేత దైవ సిగామణి కుమారుడు లోకేశ్వరన్ మరో ముగ్గురితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపులో తన ఇల్లును కోల్పోయామని, అక్కడ స్థ లం ఖాళీగా ఉన్నందున పట్టా ఇప్పించాలని లోకేశ్వరన్ కోరా రు. ఇందుకు ఎమ్మెల్యే సమ్మతించలేదు. క్రమేణా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా అప్పటికే వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో నలుగురు కలిసి ఎమ్మెల్యేపై దాడిచేశారు. విచక్షణారహితంగా ఆరుచోట్ల గాయూలయ్యూరు. ఎమ్మెల్యేపై దాడిని జిరాక్స్ దుకాణం యజమాని సోమనాథన్, అతని సోదరుడు ఆర్ముగం అడ్డుకోవడంతో వారిపైకూడా వేటు పడింది.
ఎమ్మెల్యే పై హత్యాయత్నం జరిగినట్లు వేగంగా సమాచారం పాకడంతో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని రాస్తారోకో చేశారు. దుకాణాలపై రాళ్లురువ్వారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నగరంలో అంగళ్లు మూతపడ్డాయి. పోలీసులు ఆందోళనకారులను సమాధానపరిచి రాస్తారోకోను విరమింపజేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా. శివగంగై జిల్లా మానామధురై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుణశేఖరన్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. అదే నియోజకవర్గానికి పార్టీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మానామధురై పట్టణ పంచాయతీ అన్నాడీఎంకే అధ్యక్షునిగా దైవసిగామణి ఉండేవారు. వైగై ఆట్రుపాళయం సమీపంలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో నివసిచేవారు. అధికారంలో ఉండగానే ఆయన కన్నుమూయడంతో అతని కుమారులైన లోకేశ్వరన్, శబరి తమకు పదవి దక్కుతుందని ఆశపడ్డారు.
కానీ ఆశించినది జరగలేదు. ఈ క్రమంలో గత ఏడాది మానామధురైలో ఆక్రమణ తొలగింపుల్లో వీరి ఇల్లు పోయింది. ఎమ్మెల్యే గుణశేఖరన్ ఈ విషయంలో వారికి సహకరించలేదు. ఇల్లును కోల్పోయిన ప్రాంతంలో ఇంటి స్థలం పట్టా ఇప్పించాలని ఎమ్మెల్యేను లోకేశ్వరన్ కోరారు. అయితే ఆయన వీరి మొరను పెద్దగా ఆలకించలేదు. దీంతో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రత్యక్ష సాక్షులైన సోమనాథన్ ఇచ్చిన సమాచారం మేరకు అదే నగరానికి చెందిన శశికుమార్ (23), కార్తిక్ (20), మరో కార్తిక్ (23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. గాయపడిన ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ పరామర్శించారు.