
తూర్పుగోదావరి,కాకినాడ సిటీ: కాకినాడ ఏటిమొగలో మంగళవారం ఉదయం తల్లి, కుమార్తెలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. ఎవరు ఎందుకు వీరిపై హత్యాయత్నానికి ప్రయత్నించారనే విషయాలు తెలియరాలేదు. దీనిపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో కంబాల కామేశ్వరి, కంబాల వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. తన భార్య, కుమార్తెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని కంబాల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై దాడి చేసేందుకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోర్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.