మద్యం మత్తులో హత్యాయత్నం
మద్య మత్తులో ఓ వ్యక్తి కల్లుగీసే కత్తితో మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసి వీరంగం సృష్టించాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం పరకాలలో చోటుచేసుకుంది.
పరకాల : మద్య మత్తులో ఓ వ్యక్తి కల్లుగీసే కత్తితో మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసి వీరంగం సృష్టించాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం పరకాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మామిడి శ్రీనివాస్‌గౌడ్, దొనికెన శ్రీనివాస్‌గౌడ్ గీత కార్మికులు. పట్టణ శివారులోని తాటివనంలో కల్లు తీస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జయటాకీస్ రోడ్డులోని కల్లు మండువ వద్దకు మామిడి శ్రీనివాస్ కల్లు తీసుకొచ్చాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించి దొనికెన శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి వచ్చాడు. వీరిద్దరికీ పేకాట విషయంలో పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో మామిడి శ్రీనివాస్ వద్ద ఉన్న కత్తిని దొనికెన శ్రీనివాస్ లాక్కుని దాడికి దిగారు. మామిడి శ్రీనివాస్ మెడపై నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. నడుం, చేతిపై గాయాలు చేస్తుండగా కల్లు తాగేందుకు వచ్చిన పట్టణానికి చెంది న దామ అయిలయ్య అడ్డుకోగా ఆయనపైనా రెండు చోట్ల కత్తితో పొడిచాడు. భయంతో మామిడి శ్రీనివాస్‌గౌడ్ పోలీసు స్టేషన్ వైపు పరుగుగెత్తగా అత డి వెనుకే దొనికెన శ్రీనివాస్ కత్తిపట్టుకొని పరుగెత్తాడు. కల్లు మండువ సమీపంలోనే కట్టింగ్ చేసుకోవడానికి సెలూన్ షాపు వచ్చిన మాజీ ఎంపీటీసీ మోడెం రామన్న దొనికెన శ్రీనివాస్‌ను ఆపే ప్రయత్నం చేయగా రామన్ననూ నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ ముందు నుంచే వెళ్లి ఆర్టీసీ బస్సులో పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు స్థానిక సివిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మామిడి శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సివిల్ ఆస్పత్రికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు శ్రీనివాస్‌గౌడ్ కోసం గాలిస్తున్నారు.