విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వారిపై కత్తితో దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లీ,కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అవే హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.