అనంతపురం: జిల్లాలోని ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు ప్రవీణ్ అనే వ్యక్తిని గొంతుకోసి పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రక్తపు మడుగులో అచేతన స్థితిలో పడివున్న ప్రవీణ్ పరిస్థితి విషమించడంతో అతన్ని చికిత్స మేరకు స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.